Hari Hara Veera Mallu: ‘వీరమల్లు మాట వినాలి’ .. హరి హర వీరమల్లులో పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న సినిమా హరి హర వీర మల్లు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో పవన్ బందిపోటుగా కనిపిస్తారని సమాచారం. ఇది వరకు ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, గింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో హరిహరవీరమల్లు కూడా ఒకటి. మొదట ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. తాజాగా హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి మాట వినాలి లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘వీరమల్లు మాట చెబితే వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్ కల్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషం. లిరికల్ సాంగ్‌లో పవన్ కల్యాణ్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇక మాట వినాలి పాటకు పెంచల్‌దాస్ సాహిత్యం అందించారు. ఇది వరకే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ కాగా ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. దీంతో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
హరి హర వీరమల్లు సినిమా మొత్తం రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. తొలి భాగం హరిహర వీరమల్లు-1 ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తారలు నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే విక్రమ్ జీత్, జిషు సేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, సుబ్బరాజు, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
#HariHaraVeeraMallu 1st Single is OUT NOW! 🔥 🌪#MaataVinaali – https://t.co/2oP0dJCtZK#BaatNirali – https://t.co/ddruCeq6yc#KekkanumGuruve – https://t.co/3z7eSa9cVc#MaathukeLayya – https://t.co/BJxpqgHtZI#KelkkanamGuruve – https://t.co/MrHNmQo2LX pic.twitter.com/bs2vonazje
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 17, 2025
హరి హర వీర మల్లు సెట్ లో పవన్ కల్యాణ్..
Our Veera Mallu, Powerstar @PawanKalyan garu in action for the final schedule! 💥⚔️
Here’s a BTS Picture from the sets of #HariHaraVeeraMallu 🔥💥
See you all in theaters on 28th March 2025! 🔥🔥 pic.twitter.com/ZrfzFrvS6F
— Hari Hara Veera Mallu (@HHVMFilm) December 10, 2024
మాట వినాలి సాంగ్ లిరికల్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.