
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంఢీవదారి అర్జున చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. తాజాగా వరుణ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి వైవిధ్యమైన మాస్ సినిమాలు తెరకెక్కించి ప్రత్యేక పేరును సంపాదించుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ న్యూ ప్రాజెక్ట్ రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్లో జరిగాయి. ఈ సినిమా పేరును మట్కా అని ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 1975 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మట్కా అట ప్రధానంగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు.. దక్షిణాది అన్ని భాషలన్నింటిలోనూ ఈ మూవీ విడుదలకానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. అలాగే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలకపాత్రలో నటించనుంది.
ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న గాండీవధారి అర్జున చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంద. ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
A dawn of a whole new world ❤️🔥
Our Production No.2, #VT14 Titled as #MATKA 🎬
In Telugu, Tamil, Hindi, Kannada & Malayalam💥@IAmVarunTej @KKfilmmaker #Norafatehi @Meenakshiioffl @gvprakash @PriyaSeth18 @mohan8998 @drteegala9 @Naveenc212 @ashishtejapuala @Rkjana11 @sunny4u007… pic.twitter.com/mAAWxRWVPD
— Vyra Entertainments (@VyraEnts) July 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.