AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: మట్కా టైటిల్‏తో వరుణ్ తేజ్ కొత్త సినిమా.. మెగా ప్రిన్స్ సినిమాలో ఆ హీరోయిన్..

పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి వైవిధ్యమైన మాస్ సినిమాలు తెరకెక్కించి ప్రత్యేక పేరును సంపాదించుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ న్యూ ప్రాజెక్ట్ రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‏లో జరిగాయి. ఈ సినిమా పేరును మట్కా అని ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది.

Varun Tej: మట్కా టైటిల్‏తో వరుణ్ తేజ్ కొత్త సినిమా.. మెగా ప్రిన్స్ సినిమాలో ఆ హీరోయిన్..
Varun Tej
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2023 | 2:00 PM

Share

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంఢీవదారి అర్జున చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. తాజాగా వరుణ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి వైవిధ్యమైన మాస్ సినిమాలు తెరకెక్కించి ప్రత్యేక పేరును సంపాదించుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ న్యూ ప్రాజెక్ట్ రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‏లో జరిగాయి. ఈ సినిమా పేరును మట్కా అని ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది.

ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 1975 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మట్కా అట ప్రధానంగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు.. దక్షిణాది అన్ని భాషలన్నింటిలోనూ ఈ మూవీ విడుదలకానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. అలాగే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలకపాత్రలో నటించనుంది.

ఇవి కూడా చదవండి

ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న గాండీవధారి అర్జున చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంద. ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!