మెగా ఫ్యామిలీకి దేవుడిపై విశ్వాసమెక్కువ. భక్తి కార్యక్రమాలకు బాగా ప్రాధాన్యమిస్తారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెగ్యులర్ గా అయ్యప్ప మాల ధరిస్తారు. ఇక డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కూడా గతంలో పలు సార్లు మాల ధరించారు. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హనుమాన్ మాలను వేసుకున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం (డిసెంబర్ 03) జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న వరుణ్ తేజ్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వరుణ్ కు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే కొండగట్టు ఆలయ ప్రాముఖ్యతను అంతరాలయ విగ్రహ విశిష్టతను వరుణ్ తేజ్ కు వివరించారు. దర్శనానంతరం మాట్లాడిన వరుణ్ తేజ్ కొండగట్టు అంజన్న చాలా పవర్ ఫుల్ దేవుడన్నారు. మొదటి సారి హనుమాన్ దీక్ష తీసుకున్నా.. అంజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
వరుణ్ తేజ్ తేజ్ నటించిన మట్కా సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. పలాస 1978 ఫేం డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. . తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే వరుణ్ తేజ్ నటనకు ప్రశంసలు లభించాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డిసెంబర్ 05 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది.
Mega Prince @iamVarunTej visited the Kondagattu Anjaneya Swamy Temple, donning the sacred Hanuman Mala, paying his respects with devotion and seeking blessings🛕🙏#VarunTej #HanumanMala pic.twitter.com/MlcmTpezLT
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 3, 2024
వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
risk, reward & gamble – MATKA Vasu is the ringmaster who rules them all 👑#MatkaOnPrime, December 5 pic.twitter.com/Djsux1H6nJ
— prime video IN (@PrimeVideoIN) November 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.