AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej’s Ghani movie: బాక్సింగ్ రింగ్ లో పంచ్‌లు కొడుతున్న వ‌రుణ్.. గని కోసం కష్టపడుతున్న మెగా హీరో

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో వరుణ్ తేజ్‌ది సఫరేట్ రూట్. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.

Varun Tej's Ghani movie: బాక్సింగ్ రింగ్ లో పంచ్‌లు కొడుతున్న వ‌రుణ్.. గని కోసం కష్టపడుతున్న మెగా హీరో
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2021 | 6:38 AM

Share

Varun Tej’s Ghani movie: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో వరుణ్ తేజ్‌ది సఫరేట్ రూట్. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. ఫిదా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వరుణ్ ఆ తర్వాత గద్దల కొండ గణేశ్‌తో తన నటనను నిరూపించుకున్నాడు. ఎఫ్2 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటితో సినిమా చేస్తున్నాడు. సిద్ధు ముద్ద .. అల్లు బాబీ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. బాక్సింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ‘గని’ అని టైటిల్‌ ఖరారు చేశారు. బాక్సింగ్ రింగ్ లో పంచ్‌లు కొడుతున్న వ‌రుణ్ లుక్‌ని మోషన్‌ పోస్టర్‌ ను ఆమధ్య విడుదల చేసారు చిత్రయూనిట్.

ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాలకి వెళ్లి అక్కడ బాక్సింగ్ లో శిక్షణ పొందాడు. ఇప్పటికే ఈ సినిమాను మొదలుపెట్టడంలో ఆలస్యమైపోయింది. అందువలన బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే ఇండోర్ సీన్స్ ను .. తక్కువమంది సిబ్బందితో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారట. ఆ దిశగా పనులు మొదలయ్యాయని అంటున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో  ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఈ పాత్రలో స్టార్ హీరో ఉపేంద్ర చేయనున్నాడు. అంతేకాకుండా ఇందులో వ‌రుణ్ తేజ్ కి కోచ్ గా.. సునీల్ శెట్టి, ప్రతినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ ‘సరైనోడు’కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ

Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌

Megastar Chiranjeevi: కీలక నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికులకు ఉచితంగా టీకా…

Superstar Mahesh Babu టాలీవుడ్‌లో కరోనా కలకలం… సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు..!