varun tej : మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గని’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. సినిమా కోసం బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు ఈ మెగా హీరో. అయితే బాక్సింగ్ లో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లడం.. ఆ తరువాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ వాయిదా పడింది. దాంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ సినిమాను ఎలాగైనా అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఇటీవల తిరిగి షూటింగ్ ను మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ జరిపారు. కొంత భాగం షూటింగ్ జరపగానే కరోనా సెకండ్ వేవ్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో మళ్లీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గడంతో షూటింగ్ లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో వరుణ్ చాలా కఠోరదీక్షతో వర్కౌట్ చేస్తున్నాడు. తనతో పాటు ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సల్మాన్ తో సుల్తాన్ సినిమాకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారు. అది మాత్రమే కాకుండా సినిమాలో ఉపేంద్ర – సునీల్ శెట్టి లాంటి బిగ్ స్టార్స్ నటిస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా మారింది. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయిమంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :