Samantha: అయ్యో పాపం.. షూటింగ్‌లో స్పృహ తప్పి పడిపోయిన సమంత..

తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన సామ్.. తమిళ్, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. మాయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఇప్పుడు తిరిగి బిజీ కానుంది.

Samantha: అయ్యో పాపం.. షూటింగ్‌లో స్పృహ తప్పి పడిపోయిన సమంత..
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 12, 2024 | 4:37 PM

స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత తన స్క్రీన్ మీదకొచ్చింది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన సామ్.. తమిళ్, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. మాయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఇప్పుడు తిరిగి బిజీ కానుంది. ఇక హిందీలో ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిటాడెల్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

సమంత ఈ సిరీస్ లో మరోసారి బోల్డ్ గా నటించి మెప్పించింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో మూవీ టీమ్ బిజీగా ఉంది. కాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సామ్ గురించి.. సిటాడెల్ సిరీస్ షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కాగా సినిమా షూటింగ్ లో సమంత స్పృహతప్పి పడిపోయిందని తెలిపాడు వరుణ్. సామ్ పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని వరుణ్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : దేశం విడిచి పారిపోయిన నటి.. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అంటూ..

షూటింగ్ లో భాగంగా రెండు గంటల పాటు నటిస్తుండగా సమంత స్పృహతప్పి పడిపోయిందని తెలిపాడు వరుణ్. ఇది చూసిన తనకు కంగారు వచ్చిందని.. వెంటనే ఆమెను లేపి షూటింగ్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడట. అయితే కొంత సమయం రెస్ట్ తీసుకున్న తర్వాత సామ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. సామ్ అలా పడిపోగానే అందరం ఆందోళనకు గురయ్యాం.. కానీ కోలుకున్న తర్వాత సామ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంది అని తెలిపాడు వరుణ్. సమంత 2022లో తనకు మైయోసైటిస్ ఉందని ప్రకటించింది. సినిమాలకు దూరమై థెరపీపై దృష్టి పెట్టింది సామ్. చికిత్స సమయంలో సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. కాగా ఇప్పుడు ట్రీట్‌మెంట్ తర్వాత సమంత మళ్లీ నటించడం మొదలుపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!