Bigg Boss Telugu 6: దీపికా పిల్లికి బిగ్ బాస్ షాక్ ఇచ్చిందా.. లాస్ట్ మినిట్‌లో అమ్మడి ప్లేస్‌ను రీప్లేస్ చేసిన ఆ బ్యూటీ..

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక రేటింగ్ తో దూసుకుపోయిన గేమ్ షో ఏది అంటే టక్కున చెప్పే పేరు బిగ్ బాస్. వివిధ భాషల్లో సక్సెస్ ఫుల్ గా సాగుతోన్న బిగ్ బాస్ గేమ్ షో.

Bigg Boss Telugu 6: దీపికా పిల్లికి బిగ్ బాస్ షాక్ ఇచ్చిందా.. లాస్ట్ మినిట్‌లో అమ్మడి ప్లేస్‌ను రీప్లేస్ చేసిన ఆ బ్యూటీ..
Deepika Pilli

Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2022 | 8:20 PM

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక రేటింగ్ తో దూసుకుపోయిన గేమ్ షో ఏది అంటే టక్కున చెప్పే పేరు బిగ్ బాస్(Bigg Boss). వివిధ భాషల్లో సక్సెస్ ఫుల్‌గా సాగుతోన్న బిగ్ బాస్ గేమ్ షో. తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 6 సీజన్ లోకి అడుగుపెట్టింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుంది.ఇప్పటికే ఈ సీజన్ 6 గురించి రిలీజ్ చేసిన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో హోస్ లోకి ఎవరెవరు వెళ్లనున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలా చక్కర్లు కొడుతున్న పేర్లలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు దీపికా పిల్లి.

టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ. ఇప్పుడు పలు టీవీషోలకు యాంకర్ గా చేస్తోంది.రీసెంట్ గా సుధీర్ నటించిన సినిమా హీరోయిన్ గా కనిపించింది. ఇక ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సారి బిగ్ బాస్ హౌస్ కు  వెళ్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిన్నది ప్లేస్ లో మరో భామ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందని తెలుస్తోంది. చివరి నిమిషంలో దీపికా బదులు మరో బ్యూటీని హౌస్ లోకి పంపనున్నారట. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు వర్షిణి. ఈ చిన్నది కూడా యాంకరింగ్ తో ఆకట్టుకుంటోంది. అలాగే పలు సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు దీపికా ప్లేస్ లో వర్షిణి హౌస్ లోకి వెళ్లనుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎంపిక చేసిన కంటెస్టెంట్స్‌ని హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్స్‌లో క్వారంటైన్‌కి పంపబోతున్నారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించనున్నారు. వారు ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది.

Anchor Varshini

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి