Varalaxshmi Sarathkumar: పెళ్లికి రెడీ అయిన జయమ్మ.. సైలెంట్‏గా వరలక్ష్మీ శరత్‏కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే..

తన నటనతో విలనిజం చూపిస్తూనే అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తుంది. రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకుంది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హనుమాన్ సినిమాలోనూ సూపర్ రోల్ లో మెప్పించింది. తాజాగా ఈ బ్యూటీ ఇప్పుడు తన అభిమానులతో శుభవార్త పంచుకుంది.

Varalaxshmi Sarathkumar: పెళ్లికి రెడీ అయిన జయమ్మ.. సైలెంట్‏గా వరలక్ష్మీ శరత్‏కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే..
Varalaxshmi Sarathkumar

Updated on: Mar 03, 2024 | 6:35 AM

వరలక్ష్మీ శరత్‏కుమార్ దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. హీరోయిన్‏గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు విలన్‏గా వెండితెరపై దూసుకుపోతుంది. తన నటనతో విలనిజం చూపిస్తూనే అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తుంది. రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకుంది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హనుమాన్ సినిమాలోనూ సూపర్ రోల్ లో మెప్పించింది. తాజాగా ఈ బ్యూటీ ఇప్పుడు తన అభిమానులతో శుభవార్త పంచుకుంది. తన ప్రియుడు నిక్లాయ్ సచ్ దేవ్ తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో వరలక్ష్మి, నిక్లాయ్‏కు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె. తమిళంలో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత రూటు మార్చేసింది. హీరోయిన్ గా కాకుండా విలన్.. నెగిటివిటీ రోల్స్ ఎంపిక చేసుకుంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. గతంలో ఆమె పెళ్లిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ఎప్పుడూ తన పెళ్లి వార్తలను కొట్టేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు సైలెంట్ గా తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నిక్లాయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మార్చి 1న ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

వరలక్ష్మి, నిక్లాయ్ 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు వీరిద్దరు ఇరు కుటుంబాల సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మీకి కాబోయే భర్త నిక్లాయ్ ముంబైలో ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.