Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది.. పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా పై క్రేజీ అప్డేట్

గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన తేరీ మూవీకి రీమేక్ అని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లోనూ సినిమా చేయనున్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది.. పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా పై క్రేజీ అప్డేట్
Pawan Kalyan

Updated on: Dec 07, 2023 | 11:23 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సినిమాలు వరుసగా లైనప్ చేస్తున్నారు. ప్రస్తుతం పవర్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిజానికి ఎప్పుడో మొదలైంది కానీ పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆలస్యం అవుతూ వస్తుంది. గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన తేరీ మూవీకి రీమేక్ అని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లోనూ సినిమా చేయనున్నారు పవన్ కళ్యాణ్.

సురేందర్ రెడ్డి ఇటీవలే అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు సురేందర్ రెడ్డి. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు సినీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ. వక్కంతం వంశీ ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశారు. ఇప్పుడు నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా చేస్తున్నాడు’. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వంశీ మాట్లాడుతూ..సురేందర్ రెడ్డి సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి  సినిమా కథ అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు వక్కంతం వంశీ. అలాగే రైటర్ గా తనకు కూడా ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది అని అన్నారు వక్కతం వంశీ. దాంతో పవన్ కళ్యాణ్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మ్యాన్ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు హరీష్ జై రాజ్ సంగీతం అందిస్తున్నారు.

వక్కంతం వంశీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.