‘ శుధ్ దేశీ రొమాన్స్’ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసింది అందాల తార వాణీకపూర్. ఆ తర్వాత నాని సరసన తమిళ సినిమా ‘ఆహా కళ్యాణం’లో మెరిసింది. ప్రజంట్ ఈ ముద్దుగుమ్మ అక్షయ్ కుమార్ తో ‘బెల్ బాటమ్’ మూవీలో నటిస్తోంది. కాగా ఆయుష్మాన్ ఖురానా నటిస్తోన్న నూతన చిత్రం ‘చండీగఢ్ కరే ఆశిఖీ’లో ఈ భామ ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనుందని తెలుస్తోంది. ట్రాన్స్ జెండర్ పాత్ర ఈమె నటించబోతుందట.
ట్రాన్స్ జెండర్ తో ప్రేమలో పడ్డ వ్యక్తిగా ఆయుష్మాన్ కనిపిస్తాడని సమాచారం. కాగా ఎప్పుడూ కొత్తదనం ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది వాణీకపూర్. కాగా ఇప్పటివరకు పలువురు హీరోలు ట్రాన్స్‌జెండర్ పాత్రల్లో నటించడం చూశాం. మరి వాణీ ఆ పాత్రలో ఎంత బాగా మెప్పిస్తుందో చూడాలి.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ఢిల్లీ బ్యూటీ రణ్ బీర్ కపూర్, సంజయ్ దత్ నటిస్తోన్న ‘షంషేరా’ చిత్రంలో కూడా నటిస్తోంది.
Also Read :