Kabzaa : నెగెటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లలో రచ్చే.. ఉపేంద్ర కబ్జా మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందంటే?

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం 'కబ్జా'. దర్శకుడు ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన శ్రియా శరణ్‌ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. కిచ్చా సుదీప్‌, శివరాజ్‌కుమార్‌ లాంటి స్టార్‌ హీరోలు కీ రోల్స్‌ పోషించారు

Kabzaa : నెగెటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లలో రచ్చే.. ఉపేంద్ర కబ్జా  మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందంటే?
Kabzaa

Updated on: Mar 18, 2023 | 4:55 PM

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘కబ్జా’. దర్శకుడు ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన శ్రియా శరణ్‌ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. కిచ్చా సుదీప్‌, శివరాజ్‌కుమార్‌ లాంటి స్టార్‌ హీరోలు కీ రోల్స్‌ పోషించారు. ఆనంద్ పండిట్, అలంకార్ పాండ్యన్ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇదిలా ఉంటే కబ్జా టీజర్లు, ట్రైలర్లు కేజీఎఫ్‌ సినిమాను తలపించాయి. అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్లే శుక్రవారం (మార్చి 17)న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది కబ్జా. అయితే కేజీఎఫ్‌తో పోలికలు రావడం, అందుకు తగ్గట్లు కథా కథనాలు లేకపోవడంతో నెగెటివ్ టాక్‌ వచ్చింది. కేవలం హీరో ఎలివేషన్లే హైలెట్‌ అయ్యాయని విమర్శలు వస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్ సినిమా కావడం, స్టార్‌ క్యాస్ట్‌ ఉండడంతో మొదటి రోజు వసూళ్లు పర్వాలేదు అనే రేంజ్‌లోనే వచ్చాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.26 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక తెలుగులో రూ. 1.45 కోట్లు గ్రాస్, రూ. 65 లక్షలు షేర్ రాబట్టింది కబ్జా. సినిమాలో స్టార్స్ ఉన్నప్పటికీ.. కథాకథనాలు బాగుండి ఉంటే మాత్రం ఇంకా భారీ కలెక్షన్లు వచ్చేవని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కబ్జా సినిమా అనుకున్న స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదంటున్నారు ఫ్యాన్స్‌. కబ్జా1947 నుంచి 1984 కాలంలో న‌డిచే క‌థ‌. ఒక స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు కుమారుడు మాఫియా వ‌రల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు?కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్‌ ఎలా ఎదిగాడ‌న్నదే ఈ సినిమా కథాంశం. కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, సుధ, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..