Renu Desai – Upasana: గొప్ప మనసు చాటుకున్న ఉపాసన.. రేణూ దేశాయ్‌కి గిప్ట్‌గా అంబులెన్స్.. ఎందుకో తెలుసా?
పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది రేణూ దేశాయ్. అయితే గతేడాది ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత మరే మూవీలోనూ రేణూ దేశాయ్ కనిపించలేదు.
టాలీవుడ్ ప్రముఖ నటి రేణూదేశాయ్ కు సామాజిక సేవా దృక్పథం ఎక్కువ. అనాథ పిల్లలు, మూగ జీవాల కోసం తన వంతు సహాయం చేస్తుంటుంది. అలాగే తన ఫాలోవర్స్‌ని కూడా ఈ మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఉంటుంది. తాజాగా రేణూ మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. మూగజీవాల సంరక్షణ కోసం ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే ఎన్జీవోను ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది. కొవిడ్ సమయంలో మూగ జీవాలకు ఏదైనా చేయాలని నాకు అనిపించింది. అందుకే నేను సోంతంగా ఎన్జీవో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ఫైనల్‌గా నా ఎన్జీవోను రిజిస్టర్ చేయించాను. ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. ఇందుకోసం అయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తాను. మూగ జీవాలపై ఇష్టం ఉండి ఆర్థిక సాయం చేయాలనుకునే వారు మా ఎన్జీవోకు విరాళాలు ఇవ్వండి’ అని తన ఫాలోవర్లను రిక్వెస్ట్ చేసింది రేణూ దేశాయ్. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మూగ జీవాల సంరక్షణ కోసం రేణు దేశాయ్ చేసిన మంచి పనిపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో జంతు ప్రేమికులు రేణూ దేశాయ్‌కి ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన రేణూ దేశాయ్ ప్రారంభించిన మంచి పనిలో పాలు పంచుకుంది. రేణూ దేశాయ్ ఎన్జీవోకి తనవంతు సాయం చేసింది. మూగ జీవాల కోసం అంబులెన్స్ కోనుగోలు చేయగా.. దీని కోసం తన వంతు సాయం చేసింది ఉపాసన. రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ పేరు మీద ఈ సాయం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది రేణూ దేశాయ్. ‘అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది రేణు. ఈ పోస్టుకు ఉపాసన కొణిదెలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఉపాసన మంచితనాన్ని అందరూ కొనియాడుతున్నారు.
ఉపాసనకు ధన్యవాదాలు చెప్పిన రేణూ దేశాయ్..
రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.