- Telugu News Photo Gallery Cinema photos Actress Poorna shares her marriage pohotos on occasion of wedding anniversary
Actress Poorna: పెళ్లి రోజు స్పెషల్.. అందమైన ఫొటోలు షేర్ చేసిన నటి పూర్ణ..
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీవీషోలతో బిజీ బిజీగా ఉంటోంది టాలీవుడ్ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీమ్. అదే సమయంలో తన కుమారుడి ఆలనా పాలనలో కూడా తలమునకలవుతోంది.
Updated on: Oct 27, 2024 | 7:27 PM

శ్రీమహలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ. ఆ తర్వాత వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక సుమారు రెండేళ్ల క్రితం సైలెంట్ గా పెళ్లిపీటలెక్కిందీ ముద్దుగుమ్మ. దుబాయ్ కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో కలిసి నిఖా చేసుకుంది.

ప్రస్తుతం పూర్ణ- ఆసిఫ్ లకు ఒక బాబు ఉన్నాడు. కాగా ఈ అందాల తార వివాహ బంధంలోకి అడుగు పెట్టి రెండేళ్లు పూర్తయింది.

ఈ సందర్భంగా తమ పెళ్లినాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది పూర్ణ. 'నా హృదయంలో చోటిస్తే.. తన జీవితాన్నే ఇచ్చేశాడు' అని వీటికి క్యాప్షన్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం పూర్ణ షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూర్ణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




