Varun Tej-Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేదిక ఫిక్స్.. మేం వచ్చేశాం అంటూ హింట్ ఇచ్చేసిన ఉపాసన..
ఈ క్రమంలోనే మెగా ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి.. అలాగే ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే వరుణ్, లావణ్య వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరి పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విషయాలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ , వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి షూరు కానుంది మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం అతి తొందర్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే మెగా ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి.. అలాగే ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే వరుణ్, లావణ్య వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరి పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విషయాలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ , వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
అంతేకాకుండా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. పెళ్లి ఎక్కడ అన్నది క్లారిటీ ఇచ్చేశారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టస్కనీ.. మేం వచ్చేశాం అంటూ రాసుకొచ్చారు. ఇటలీ మధ్య ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా టస్కనీ ప్రఖ్యాతిగాంచింది. టస్కనీ రాజధాని ఫ్లోరెన్స్ అపురూప శిల్పకళా సంపదకు నిలయంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ ఎల్బా ప్రాంతంలోని బీచ్ లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇక అక్కడే వరుణ్, లావణ్య వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇదిలా ఉంటే వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడకకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ముందు నుంచి వీరి వివాహం డిసెంబర్ లో జరగనుందని టాక్ వినిపించింది. ఇప్పుడు వచ్చే నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు నెట్టింట పంచుకున్నారు. ఆ ఫోటోలలో మెగా ఫ్యామిలీతోపాటు అల్లు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
