Upasana: 9 వారాల సాయిబాబా వ్రతం పూర్తి చేసిన ఉపాసన.. చివరి రోజు మెగా కోడలు చేసిన పనికి చప్పట్లు కొట్టాల్సిందే
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమని ఉపాసన కొణిదెలకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. ఈ క్రమంలోనే ఆమె నియమ నిష్టలతో 9 వారాల సాయి బాబా వ్రతం పూర్తి చేసింది. ఇక వ్రతంలో చివరి రోజు భాగంగా ఉపాసన చేసిన పని అందరి మన్ననలు అందుకుంటోంది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సాయి బాబా వ్రతం పూర్తి చేసింది. గురు పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించిన ఆమె సుమారు 9 వారాల పాటు నియమ నిష్టలతో సాయి బాబాకు పూజలు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (సెప్టెంబర్ 04)తో ఈ వ్రతం పూర్తయిందని సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది ఉపాసన. ఈ వ్రతాన్ని లతా సిస్టర్‌తో(క్లీంకార నర్సు) కలిసి ప్రారంభించినట్లు ఈ వీడియోలో తెలిపింది మెగా కోడలు .. ‘గురు పౌర్ణిమి రోజు ప్రారంభమైన సాయిబాబా వ్రతం 9 వారాల జర్నీతో శాంతిగా ఎంతో నమ్మకంతో నడిచింది. నా సోదరితో కలిసి నేను ఈ వ్రతాన్ని ప్రారంభించాను. ఈ వ్రతంతో నేను కోరుకున్న దాని కంటే ఎక్కువగా నాకు బాబా ఆశీస్సులు లభించాయి. నన్ను సదా రక్షిస్తున్న ఆ సాయినాథునికి ధన్యవాదాలు.నా జీవితంలో వీలైనంత ఎక్కువమందికి సేవ చేస్తానని ఈ వ్రత దీక్షలో బాబాను ప్రార్థించాను. అందులో భాగంగానే అత్తమ్మాస్ కిచెన్ తరఫున ఈ రోజు ఉచితంగా భోజనం వడ్డిస్తున్నాం. జై సాయిరామ్’ అని వీడియోలో చెప్పుకొచ్చింది ఉపాసన.
సాయి బాబా వ్రతంలో భాగంగా చివరి రోజు అత్తమ్మాస్ కిచెన్ ద్వారా వచ్చిన డబ్బులతో సుమారు 945 మందికి ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. సేవా గుణంలో మెగా కోడలు మరో మెట్టు ఎక్కేశారంటూ మెగా ఫ్యాన్స్ ఉపాసనను కొనియాడుతున్నారు.
ఉపాసన షేర్ చేసిన వీడియో..
View this post on Instagram
వ్రతంలో ఉండగానే..
కాగా సాయి బాబా వ్రతం ప్రారంభించిన కొద్ది రోజులకే తెలంగాణ ప్రభుత్వం ఉపాసనకు కీలక పదవిని కట్ట బెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మెగా కోడలికి స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ కు ఆమె కో ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు. దీంతో సాయి బాబా వ్రతం ఫుణ్య ఫలంతోనే ఈ పదవి ఉపాసనకు వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Connecting with God is a way of connecting with yourself. This Guru Purnima, I begin the Sai Baba Vrat and invite you all for this 9 weeks of spirituality & bliss with Athamma’s Kitchen 🙏 https://t.co/uS4Jrqrszq We’ve curated a sai vrat kit for your convenience
ॐ साईं राम ఓం… pic.twitter.com/rnnfUm8azM
— Upasana Konidela (@upasanakonidela) July 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







