Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable S4: బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. చంద్రబాబు ఏమన్నారంటే

మునుపెన్నడూ చూడని విధంగా బాలయ్య తన హోస్టింగ్ తో షోను ఇండియాలో టాప్ లో నిలబెట్టారు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన బాలకృష్ణ ఇప్పుడు అన్ స్టాపబుల్ అంటూ డిజిటల్ వరల్డ్ లోనూ దూసుకుపోతున్నారు.

Unstoppable S4: బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. చంద్రబాబు ఏమన్నారంటే
Jr Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 23, 2024 | 7:31 PM

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ సీజన్ విజయవంతంగా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ టాక్ షోకు ఎంతో మంది స్టార్స్ గెస్ట్ లుగా హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా బాలయ్య తన హోస్టింగ్ తో షోను ఇండియాలో టాప్ లో నిలబెట్టారు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన బాలకృష్ణ ఇప్పుడు అన్ స్టాపబుల్ అంటూ డిజిటల్ వరల్డ్ లోనూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే ఈ టాక్ షోలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ , రాజమౌళి, సుకుమార్, బోయపాటి లాంటి స్టార్ హీరోలు, డైరెక్టర్స్ తో పాటు యంగ్ హీరోలు కూడా హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా బాలయ్య షోలో సందడి చేశారు.

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

ఇక ఇప్పుడు సీజన్ 4లో మొదటి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు అయ్యారు. గతంలోనూ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యారు. ఇక ఇప్పుడు సీఎంగా ఆయన ఈ షోలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో విడుదల చేశారు. బాబు , బాలయ్య కలిసి చాలా విషయాలను చర్చించారు.

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

కాగా చంద్రబాబు, బాలకృష్ణ ఎపిసోడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. బాబు, బాలయ్య కలిసి ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడుకున్నారు.? అనేది తెలియాలంటే అక్టోబర్ 23న స్ట్రీమింగ్ కానున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ చూడాల్సిందే.. అలాగే ఈ టాక్ షోలో చంద్రబాబు అవకాశవాది అనేది ఆయనపై ఉన్న అపవాదా? నిజమా? జనసేనతో పొత్తు విషయంలో ఆయన స్టాండ్ ఏంటి?  తమ పాలనలో రెడ్ బుక్ పేరిట రాజ్యాంగేతరంగా వ్యవహరిస్తున్నారా? ప్రత్యర్థులను అన్యాయంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? లేదా చట్టానికి లోబడే చర్యలు తీసుకుంటున్నారా?,  భవిష్యత్తులో టీడీపీని సమర్థవంతగా నడపగల శక్తి లోకేష్ ఉందంటారా? జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఎలా స్పందించారు.? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉందా? తమవారికి ఒకలా, పరాయివారికి ఒకలా ట్రీట్ చేస్తున్నారా?,  గ్రౌండ్ లెవెల్లో జనసేన, టీడీపీ మధ్య సమన్వయ లోపం ఉందా? ప్రోటోకాల్ విషయంలో టీడీపీ నాయకులు జనసేనను తక్కువగా చూస్తున్నారా? అలాగే అమరావతి అందరికి రాజధానా? లేదా సంపన్నులకు మాత్రమే రాజధానిగా మారనుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ లో సమాదానాలు దొరకనున్నాయి. అస్సలు మిస్ అవ్వకండి.

ఇది కూడా చదవండి : Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.