Unstoppable 2: బాయ్స్ రెడీనా.. బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు.. అదిరే సాంగ్ రెడీ
బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు. బోలెడంత ఫన్ తెస్తున్నాడు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురంచి అప్ డేట్ ఇచ్చింది ఆహా టీమ్. ఆ విశేషాలు మీ కోసం.
NBK Unstoppable: అన్‌స్టాపబుల్ అంటూ ఆహా ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. బాలయ్య ఏంటి.. టాక్ షో హోస్ట్ ఏంటి అంటూ తొలుత పెదవివిరిచినవారు సైతం.. ఫస్ట్ ఎపిసోడ్ ప్రొమోతోనే నోరెళ్లబెట్టారు. ఓటీటీలలోనే కాదు.. టెలివిజన్‌లో సైతం ఇంత హిట్ అయిన టాక్ షో మరోటి లేదేమో అనిపించింది. నవ్వుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ సూపర్ ఫన్ జనరేట్ చేశారు బాలయ్య. ఆయన ఎనర్జీ, జోష్.. ప్రశ్నలు అడిగే విధానం, ఇన్‌స్టెంట్ పంచ్‌లు, గెస్టులుగా ఊహించని సెలబ్రిటీలు.. మొత్తంగా అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్ అదిరిపోయింది. ఈ షోతో ఆహా(Aha) ఓటీటీ లవర్స్‌కు ఫీస్ట్ అందించింది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ విజయ దశమి కానుకగా సీజన్ 2 మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది. అందుకోసం అన్‌స్టాపబుల్ యాంథమ్ పేరుతో ఓ స్పెషల్ సాంగ్ కూడా రెడీ చేశారు. ఈ సాంగ్ నెక్ట్స్ లెవల్‌లో ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తుందని టాక్ నడుస్తుంది. అయితే ఈసారి ప్రచారంలో ఉన్న సెలబ్రిటీల లిస్ట్ సైతం.. అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్క లాంటివాళ్లు ఈ షోలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.
Edaina ee song release ayyevarake… Once Balayya Steps-in History Repeats.. ikkada play cheste resound ekkado osthadi.. Guarantee..!!!
Baap of all talk shows is here.. Unstoppable Anthem.. Coming Soon.!#UnstoppableWithNBK2 #Unstoppable pic.twitter.com/9ZGoomHD07
— ahavideoin (@ahavideoIN) September 23, 2022
సీజన్ 1ను మించి సీజన్ 2ను తగ్గేదే లే అనే రేంజ్‌లో ఆహా టీమ్ ప్లాన్ చేసిందట. పవన్ కల్యాణ్ ఓ ఎపిసోడ్‌కు వస్తారని టాక్ నడుస్తుంది. ఇదే జరిగితే మాత్రం మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్‌కు ఇంతకు మించిన పండగ మరొకటి లేదనే చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..