AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: ఊహించని ఎలిమినేషన్.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేది ఆమేనా..

ఇప్పటికే టాప్ 5 లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అవుతున్నారు. తాజాగా మరో ఊహించని ఎలిమినేషన్ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే బి బిగ్ బాస్ హౌస్ నుంచి ఆర్జే సూర్య ఎలిమినేషన్ అవ్వడమే షాక్ అనుకుంటే..

Bigg Boss 6 Telugu: ఊహించని ఎలిమినేషన్.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేది ఆమేనా..
Bigg Boss 6
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2022 | 5:08 PM

Share

బిగ్ బాస్ సీజన్ 6 అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంది. ఇక ఈ వారం ఎలిమేషన్ కు రంగం సిద్ధం అయ్యింది. అయితే  బిగ్ బాస్ సీజన్ 6లో ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే టాప్ 5 లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అవుతున్నారు. తాజాగా మరో ఊహించని ఎలిమినేషన్ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే బి బిగ్ బాస్ హౌస్ నుంచి ఆర్జే సూర్య ఎలిమినేషన్ అవ్వడమే షాక్ అనుకుంటే.. అంతకుమించి అన్నట్టుగా ఈవారంలో ఊహించని ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టినట్టు తెలుస్తోంది. ఆ ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో కాదు హౌస్ లో తానే తోపు అనుకున్న గీతూ. గలాటా గీతూ.. ఈవిడ బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ గురించి ప్రతిరోజు ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పటికే తాను విన్నర్ అని చెప్పుకుంటున్న గీతూ..ఈవారం హౌస్ నుంచి బయటకు వెళ్లనుందని తెలుస్తోంది.

ఈవారం నామినేషన్‌లో మొత్తం 10 మంది ఉన్నారు. రేవంత్, ఇనయ, కీర్తి, బాలాదిత్య, ఆదిరెడ్డి, గీతు, రోహిత్, ఫైమా, మెరీనా, శ్రీసత్య ఈ పది మంది నామినేషన్‌లో ఉండగా.. వీరిలో గీతూ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. గీతూకి ఓటింగ్ తక్కువ రావడంతో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని తెలుస్తోంది.

అయితే హౌస్ లో మొదటి నుంచి గీతూ రచ్చ చేస్తూనే ఉంది. తన మాటతీరుతో ఎదుటివారితో ఎప్పుడూ గొడవలు పెట్టుకోవడం. నేను ఇలానే ఉంటాను అంటూ అవతలివారికి విసుగు తెప్పిస్తూ..హౌస్ లో హడావిడి చేస్తూ వస్తోంది గీతూ. బిగ్ బాస్ చెప్పింది కానీ.. ఇంటి సభ్యులు చెప్పింది కానీ వినకుండానే.. నాకు నచ్చినట్టు ఆడతా అంటూ ప్రేక్షకుల్లో నెగిటివిటి పెంచుకుంది. మరి గీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిందా అన్నది నేటి ఎపిసోడ్ లో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..