RRR Movie: నాటు నాటు పాటకు ఉక్రెయిన్ సైన్యం డ్యాన్స్.. యుద్దానికి వ్యతిరేకంగా తెలుగు సాంగ్‏కు స్టెప్పులు..

|

May 30, 2023 | 4:49 PM

ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆర్మీ అఫీషియల్స్ డ్రోన్స్ సహాయంతో ఓ ప్రయోగాన్ని చేశారు. దీనికి ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటను ఉపయోగించారు. ఈ పాటకు సైన్యం డాన్స్ చేస్తుండగా.. డ్రోన్లను ప్రయోగించారు. ఈ వీడియోను ఆ దేశ ప్రముఖులు ట్వీట్ చేయగా.. నెట్టింట వైరలయ్యింది. ఉక్రెయిన్‌ ఆర్మీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రీ ట్వీట్ చేసింది.

RRR Movie: నాటు నాటు పాటకు ఉక్రెయిన్ సైన్యం డ్యాన్స్.. యుద్దానికి వ్యతిరేకంగా తెలుగు సాంగ్‏కు స్టెప్పులు..
Naatu Naatu Song
Follow us on

రష్యాపై దాడులను ఉక్రెయిన్‌ సైన్యం ప్రత్యేక రీతిలో సెలబ్రేట్‌ చేసుకుంది. తమపై రష్యా చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ ఆర్మీ నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ వీడియో విడుదల చేసింది. ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆర్మీ అఫీషియల్స్ డ్రోన్స్ సహాయంతో ఓ ప్రయోగాన్ని చేశారు. దీనికి ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటను ఉపయోగించారు. ఈ పాటకు సైన్యం డాన్స్ చేస్తుండగా.. డ్రోన్లను ప్రయోగించారు. ఈ వీడియోను ఆ దేశ ప్రముఖులు ట్వీట్ చేయగా.. నెట్టింట వైరలయ్యింది. ఉక్రెయిన్‌ ఆర్మీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రీ ట్వీట్ చేసింది. నాటు నాటు సాంగ్ ని ఉక్రెయిన్ ఆర్మీ తమ భాషలోకి అనువదించుకుని పెర్ఫామ్ చేసింది. రష్యా ఆర్మీని విలన్ గా చూపిస్తూ ఎనర్జిటిక్ గా, ఫన్నీగా చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ సమయంలో భారత్‌లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాటు నాటు సాంగ్ కి సరైన వేదిక కోసం రాజమౌళి అన్వేషిస్తుండగా ఎవరో ఉక్రెయిన్ లో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ గురించి చెప్పారు. ఆ ప్యాలెస్ బయట ఆవరణం నాటు నాటు సాంగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అక్కడకి వెళ్లారు. ఈ సాంగ్ లో డ్యాన్స్ చేసిన కో డ్యాన్సర్లు అంతా ఉక్రెయిన్ వాళ్లే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీపై యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సినిమా ఇది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించగా.. అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా, సముద్రఖని కీలకపాత్రలలో కనిపించారు. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించగా.. ఇందులోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది.