Mahesh Babu’s Mother Death: ఒకే ఏడాది ఘట్టమనేని ఇంట రెండు విషాదాలు.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

|

Sep 28, 2022 | 9:31 AM

కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి నేటి తెల్లవారుజామున తుదిశ్వస విడిచారు.

Mahesh Babus Mother Death: ఒకే ఏడాది ఘట్టమనేని ఇంట రెండు విషాదాలు.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
Ramesh Babu, Ghattamaneni I
Follow us on

కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి నేటి తెల్లవారుజామున తుదిశ్వస విడిచారు. ఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందిరా దేవి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. నేటి మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందిరా దేవి ఆరోగ్యం క్షీణించడంతో గత పదిరోజులనుంచి కుటుంబసభ్యులంతా ఆమె దగ్గరే ఉంటున్నారు. మహేష్ బాబు కూడా 10 రోజులనుంచి ఆమెతోనే ఉన్నారు.

ఇప్పుడు ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే ఏడాది మరో విషాదం కూడా ఘట్టమనేని కుటుంబంలో జరిగిన విషయం తెలిసిందే. మహేష్ బాబు అన్న, కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు 8 జనవరి అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు కన్నుమూయడం మహేష్ ను ఎంతో బాధించింది. అదే సమయంలో మహేష్ బాబుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన చివరి చూపుకు నోచుకోలేకపోయారు. ఇప్పుడు తల్లి మరణంతో మరింత కృంగిపోయారు మహేష్.

ఇక ఇందిరా దేవి అంతే మహేష్ కు ఎనలేని మమకారం. ఇందిరాదేవిని ప్రాణంగా చూసుకునేవారు పిల్లలు.. పద్మ, మంజుల, ఇందిర ప్రియదర్శిని, రమేష్‌ బాబు, మహేష్‌బాబు. ఇందిరాదేవి పుట్టినరోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టి, తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్‌. పెద్ద కుమారుడు రమేష్‌బాబు మృతితో ఇందిరాదేవి మరింత కుంగిపోయారు. రమేష్‌ జ్ఞాపకాల నుంచి ఆమె తేరుకోలేకపోయారు. దానికి తోడు అనారోగ్యబారిన పడటంతో కోలుకోలేక కన్నుమూశారు. ఆ మధ్య విజయ్‌ నిర్మల, ఇటీవల రమేష్‌బాబు మృతితో దిగాలుచెందిన సూపర్‌స్టార్‌ కృష్ణకు… ఇప్పుడు ఇందిరాదేవి దూరం కావడం మరింత బాధాకరం. ఈ సమయంలో ఆయనకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు సినీ ప్రముఖులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.