Disha Patani: దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. ఇద్దరు నిందితుల ఎన్ కౌంటర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై దాడి చేసిన ఇద్దరు నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. హీరోయిన్ కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులను పట్టుకుంటామని సీఎం యోగి ఆదిత్య నాథ్ చెప్పిన 24 గంటల్లోనే నిందితులిద్దరూ ఎన్ కౌంటర్ లో హతం కావడం గమనార్హం.

Disha Patani: దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. ఇద్దరు నిందితుల ఎన్ కౌంటర్
Disha Patani House Firing

Updated on: Sep 17, 2025 | 9:51 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాలీవుడ్‌లో కూడా ఈ కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు వారిద్దరూ ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. యూపీ పోలీసుల సమాచారం ప్రకారం, బరేలీలోని దిశా పటానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్ కౌంటర్ చేసింది. ఈ ఇద్దరి నిందితుల్లో ఒకరి పేరు రవీంద్ర అలియాస్ కల్లు అని, మరో నిందితుడి పేరు అరుణ్ అని వెల్లడైంది. ఘజియాబాద్‌లో పోలీసుల ఎస్‌టిఎఫ్ బృందం, ఈ నిందితుల మధ్య ఎన్‌కౌంటర్ జరగ్గా ఇద్దరూ హతమయ్యారని పోలీసులు వెల్లడించారు.  ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, దిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. వారిని రవీంద్ర, అరుణ్‌లుగా పోలీసులు గుర్తించారు.  ఘటనాస్థలం నుంచి తుపాకులు, పెద్దమొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

ఇవి కూడా చదవండి

నిందితులిద్దరూ రోహిత్ గోదారా,  గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 12న  బరేలీ జిల్లాలో ఉన్న హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులకు తెగ బడ్డారు ఇద్దరు నిందితులు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదైంది.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటానీ  వ్యాఖ్యలు చేశారన్న కారణంగా కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్‌ గ్యాంగ్‌ స్వయంగా ప్రకటించుకుంది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు.

ఎన్ కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో దృశ్యాలు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి