Priyanka Nalkari: గుడిలో సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్నటాలీవుడ్‌ నటి.. ఫొటోలు చూసి షాకవుతున్న ఫ్యాన్స్

తెలుగులో పలు సీరియల్స్‌, టీవీ షోల్లో నటించి మెప్పించిన ప్రియాంక నల్కారి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రేమికుడు రాహుల్‌తో కలిసి సింపుల్‌గా ఏడడుగులు నడిచింది. మలేషియాలోని మురుగన్‌ ఆలయంలో వీరి వివాహం జరిగింది. అనంతరం #JustMarried అనే హ్యాష్‌‌ట్యాగ్‌తో ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది

Priyanka Nalkari: గుడిలో సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్నటాలీవుడ్‌ నటి.. ఫొటోలు చూసి షాకవుతున్న ఫ్యాన్స్
Priyanka Nalkari

Updated on: Mar 24, 2023 | 9:33 AM

తెలుగులో పలు సీరియల్స్‌, టీవీ షోల్లో నటించి మెప్పించిన ప్రియాంక నల్కారి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రేమికుడు రాహుల్‌తో కలిసి సింపుల్‌గా ఏడడుగులు నడిచింది. మలేషియాలోని మురుగన్‌ ఆలయంలో వీరి వివాహం జరిగింది. అనంతరం #JustMarried అనే హ్యాష్‌‌ట్యాగ్‌తో ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. అలాగే తన స్టేటస్‌లో కూడా ఒక ఫొటో, వీడియోను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసి అభిమానులు, ఫాలోవర్లు, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అదే సమయంలో కొత్త దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా ప్రియాంక టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. 2010లో విడుదలైన శర్వానంద్‌ ‘అందరి బంధువయా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత కొద్దిగా గ్యాప్‌ తీసుకుంది. ఇక జబర్దస్త్‌ లో గెటప్‌ శ్రీనుతో కలిసి కొన్ని స్కిట్లు కూడా చేసింది. అలాగే ఈటీవీ ప్లస్‌ సినిమా చూపిస్తా మామలో యాంకర్‌గా కూడా మెప్పించింది. అయితే పెద్దగా క్లిక్‌ కాకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లిపోయింది.

ప్రియాంక నటించిన తమిళ్‌ సీరియల్‌ రోజా కు మంచి టీఆర్పీ రావడంతో అక్కడే సెటిలైంది. ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లో కూడా నటించింది. ఇక ప్రియాంక భర్త రాహుల్ వర్మవిషయానికొస్తే.. అతను ఓ వ్యాపారవేత్త అని తెలిసింది. ఇతను కూడా తెలుగులో పలు సీరియళ్లో నటించాడని, అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. అంతేకాదు 2018లోనే నిశ్చితార్థం చేసుకున్నారట. అయితే అనుకోని కారణాలతో పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. దీంతో రాహుల్ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుని మలేషియా వెళ్లిపోయాడని తెలిసింది. ఇప్పుడు అతనితోనే ప్రియాంక మూడు ముళ్లు వేయించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..