AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay: కొత్త చిక్కుల్లో దళపతి విజయ్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ కొత్త చిక్కుల్లో పడ్డారు. తాజాగా బీస్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ స్టార్ హీరో మీద సోషల్ మీడియా దాడి మొదలైంది.

Thalapathy Vijay: కొత్త చిక్కుల్లో దళపతి విజయ్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
Vijay Thalapathy
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2021 | 3:15 PM

Share

Thalapathy Vijay:

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ కొత్త చిక్కుల్లో పడ్డారు. తాజాగా బీస్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ స్టార్ హీరో మీద సోషల్ మీడియా దాడి మొదలైంది.మొన్న మాస్టర్ సినిమాతో సంక్రాంతికి విజయం అందుకున్నాడు విజయ్. ప్యాండమిక్ తర్వాత వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అదే విజయ్ రేంజ్ ఏంటనేది చూపిస్తుంది. మరోవైపు తెలుగులోనూ విజయ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. కొద్ది రోజులుగా నేషనల్ అప్పీల్ ఉన్న సినిమాలు చేస్తున్న విజయ్‌.. టైటిల్స్‌ కూడా యూనివర్సల్ అప్పీలు ఉండేలా సెలెక్ట్ చేసుకుంటున్నారు.. ఈ డెసిషనే ఇప్పుడు ఆయన్ని చిక్కుల్లో పడేసింది. కొంత కాలంగా విజయ్ సినిమాలన్నీ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. అవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు విజయ్‌ సినిమాల టైటిల్స్‌ కూడా కొత్త కాంట్రర్సీలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. తమిళనాట సినీ అభిమానులకు కూడా భాషాభిమానం కాస్త ఎక్కువే. అందుకే తమిళ సినీ పరిశ్రమలో సినిమాలకు తమిళ టైటిల్స్ పెడితే రాయితీలు కూడా ఇస్తోంది ప్రభుత్వం.

అయితే విజయ్‌ మాత్రం ఇలాంటి రాయితీలను పట్టించుకోవటం లేదు. సర్కార్‌, మాస్టర్‌, బీస్ట్‌ లాంటి ఇంగ్లీష్‌, హిందీ పదాలను టైటిల్స్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలోనే ఇళయ దళపతిని టార్గెట్ చేస్తున్నారు ఓ వర్గం ఆడియన్స్‌. సినిమాలకు తమిళ టైటిల్సే దొరకటం లేదా? దొరికితే పరభాషా టైటిల్స్ ఎందుకు? అని … ట్రోలింగ్ మొదలు పెట్టారు. మరి విమర్శలకు విజయ్ ఆర్మీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nandini Rai Dance: పోసాని శవం దగ్గర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్ లో చిందేసిన నందిని రాయ్.. వీడియో వైరల్

Anu Emmanuel: అను బేబీ ప్రేమలో పడిందా..? నెటిజన్లల్లో అనుమానులు రేకెత్తిస్తున్న అమ్మడి ఫోటోలు..

Hrithik Roshan: విజువల్ వండర్ గా రానున్న హృతిక్ రోషన్ క్రిష్ 4.. స్టోరీ ఇదే అంటూ చక్కర్లు కొడుతున్న వార్త..