Trisha Krishnan: ‘యానిమల్’ సినిమాకు రివ్యూ ఇచ్చిన త్రిష.. ఓ ఆటాడుకుంటున్న నెటిజన్స్.. ఎందుకంటే..
మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సెషన్ సృష్టించింది. ఆ తర్వాత రోజుల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇందులో రణబీర్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. అయితే ప్రశంసలతోపాటు... విమర్శలు సైతం వస్తున్నాయి. ఈ సినిమా చూసిన కొందరు అడియన్స్ డైరెక్టర్ సందీప్ వంగా రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉందని.. అలాగే బోల్డ్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ఇందులో రష్మిక మందన ఇలా నటిస్తుందని ఊహించలేదని..
డైరక్టర్ సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన నటించిన సినిమా యానిమల్. గత శుక్రవారం డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవ్లలో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సెషన్ సృష్టించింది. ఆ తర్వాత రోజుల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇందులో రణబీర్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. అయితే ప్రశంసలతోపాటు… విమర్శలు సైతం వస్తున్నాయి. ఈ సినిమా చూసిన కొందరు అడియన్స్ డైరెక్టర్ సందీప్ వంగా రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉందని.. అలాగే బోల్డ్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ఇందులో రష్మిక మందన ఇలా నటిస్తుందని ఊహించలేదని.. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడలేమంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. విడుదలకు ముందు ఈ సినిమాకు చాలా పబ్లిసిటీ చేశారని.. కానీ ఫ్యామిలీతో చూడడం కష్టమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా త్రిష యానిమల్ సినిమాపై రివ్యూ ఇచ్చింది. ఈ సినిమా గురించి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన ఆలోచనలను పంచుకుంది. యానిమల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. కల్ట్ మూవీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెట్టింట త్రిషను ఓ ఆటాడుకుంటున్నారు నెటిజన్స్. ఇంత చెత్త సినిమాను కల్ట్ అంటారా?. ఫేక్ ఫెమినిస్ట్ త్రిష అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే నెట్టింట కామెంట్స్ దారుణంగా రావడంతో తన ఇన్ స్టా స్టోరీని తొలగించింది త్రిష. గతంలో మాన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలను మరోసారి తెరపైకి తీసుకువస్తూ. త్రిషకి యానిమల్ కల్ట్ సినిమానా?.. సూక్తులు చెప్తారు.. కానీ పాటించరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు త్రిషకు అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. తోటి ఆర్టిస్ట్‌గా త్రిష ఆ సినిమాను మెచ్చుకున్నారని అంటున్నారు. సినిమాను, వారి నటనను మాత్రమే త్రిష మెచ్చుకున్నారని.. కొందరు అర్థం చేసుకోకుండా ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు. సినిమా చూసిన తర్వాత తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. త్రిషని విమర్శించకండి. యానిమల్ సినిమా గురించి చెప్పకూడదా ?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.