Actor Nani: నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన నాని.. ఏ మూవీ అంటే..

ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈమూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. తన ఫిల్మ్ కెరీర్ , పర్సనల్ విషయాల గురించి చెబుతూ... ఇండస్ట్రీలో హీరోలతో తనకున్న స్నేహం పై ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

Actor Nani: నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన నాని.. ఏ మూవీ అంటే..
Nani, Nithiin
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 05, 2023 | 10:22 AM

న్యాచురల్ స్టార్ నాని.. యూత్‍లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరో. అసిస్టెండ్ డైరెక్టర్‏గా సినీ ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు నాని. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈమూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. తన ఫిల్మ్ కెరీర్ , పర్సనల్ విషయాల గురించి చెబుతూ… ఇండస్ట్రీలో హీరోలతో తనకున్న స్నేహం పై ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ఆరంభించి.. హీరోగా మారాడు నాని. అదే సమయంలో హీరో నితిన్ సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న నాని.. నితిన్ సినిమాకు అసిస్టెండ్ డైరెక్టర్ గా పనిచేశారట. కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ బాపు దగ్గర పనిచేశారు నాని. ఆ సమయంలో నితిన్, శ్రీకాంత్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2005లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ హీరోగా అల్లరి బుల్లోడు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి నాని అసిస్టెండ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో నితిన్ తో తనకున్న స్నేహాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మూవీ షూటింగ్ సమయంలో సెట్ లో నితిన్ తనతో ఎక్కువగా మాట్లాడేవారని.. హీరోలందరిని బాబు అని పిలుస్తుండేవారని.. కానీ తాను మాత్రం నితిన్ ను అలా కాకుండా పేరు పెట్టి పిలిచేవాడినని అన్నారు.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

నాని అలా పిలివడం నితిన్ ఇష్టపడేవారట. బాబు అని పిలవాలని చిత్రనిర్మాత చెప్పారని.. కానీ నితిన్ మాత్రం తనను పేరు పెట్టి పిలవాలని చెప్పాడని అన్నారు నాని. నితిన్.. నిత్ అని పిలిచేవాడినని చెప్పుకొచ్చాడు నాని. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు నాని. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసున్న అన్ సీన్ పిక్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.