Tollywood: సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడు ఒక్కడ్నే బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్..?

|

May 17, 2023 | 7:30 PM

హిట్టైనపుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు.. నువ్ లేకేపోతే సినిమానే అనాథ అయిపోతుందంటారు. కానీ అదే సినిమా తేడా కొడితే మాత్రం.. కెప్టెనే షిప్‌ను ముంచేసాడంటారు. కాసేపు నిజాలు మాట్లాడుకుందాం.. స్టార్ హీరోల సినిమాలకు దర్శకుల మాట వేదమా.. వాళ్లు చెప్పిందే నడుస్తుందా అక్కడ. మరి అలాంటప్పుడు దర్శకులనొక్కరినే బలిచేయడం ఎంతవరకు కరెక్ట్..? అహా.. ప్రేక్షకుల్లో ఉన్న బేసిక్ డౌట్ ఇది..!

Tollywood: సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడు ఒక్కడ్నే బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్..?
Akhil Akkineni Surender Reddy
Follow us on

కథ వినేటపుడు అంతా కలిసి కూర్చుని వింటారు.. అబ్బో అద్భతం అని ఓటేస్తారు. అప్పుడు స్క్రిప్ట్‌లో లోపాలేం కనిపించవా..? ఆ సినిమా సెట్స్‌పైకి వచ్చిన తర్వాత కూడా వాళ్లకేం తేడా కొట్టదా..? తీరా విడుదలై ఫ్లాపైతే మాత్రం అంతా మంచోళ్ళే.. దర్శకుడు ఒక్కడే చెడ్డోడైపోతాడా.. ఇదెక్కడి న్యాయం అనేది కామన్ ఆడియన్ ప్రశ్న. ఈ మధ్య చాలా సినిమాలకు ఇదే జరుగుతుంది.

సినిమా ప్లాపైనపుడు కొందరు హీరోలు మాత్రమే ఇది మా తప్పు అంటున్నారు. మిగిలిన వాళ్లెందుకు బాధ్యత తీసుకోలేకపోతున్నారనేది అర్థం కాని విషయం. సీనియర్స్‌ను చూసి జూనియర్లు కూడా ఇదే నేర్చుకుంటున్నారేమో మరి..? తాజాగా ఏజెంట్ ఫ్లాప్‌పై అఖిల్ లెటర్ రిలీజ్ చేసారు. అందులో అందరి పేర్లున్నాయి.. ఒక్క సురేందర్ రెడ్డి పేరు తప్ప. ఫ్లాప్‌లో దర్శకుడి బాధ్యత ఉంటుంది కాదనలేం.. కానీ వాళ్లొక్కరిదే ఉందంటే మాత్రం తప్పే అవుతుంది.

ఎవరి వరకో ఎందుకు.. చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా ఆచార్య ఫ్లాప్ భారమంతా కొరటాల శివపై వేసారు. ఆయనేం చెప్తే అదే చేసామని చెప్పారు. అక్కడితోనే అయిపోలేదు.. ఆచార్య తర్వాత చాలా చోట్ల దర్శకులపై సెటైర్లు వేసారు చిరంజీవి. వర్క్ షాప్స్ లేకుండా ఆన్ లొకేషన్‌లో స్క్రిప్ట్ రాస్తారని.. బడ్జెట్ హద్దులు లేకుండా ఖర్చు చేస్తారని.. ఎక్స్ ట్రా సీన్స్ తీస్తారని.. వీలు దొరికిన ప్రతీసారి దర్శకులకు క్లాస్ పీకారు మెగాస్టార్. చిరంజీవి మాత్రమే కాదు.. అప్పట్లో నాగార్జున సైతం భాయ్ ఫ్లాప్ అయిన తర్వాత పూర్తిగా దర్శకుడు వీరభద్రం చౌదరిపై నిందలేసారు. దీనికి ఆ దర్శకుడు కూడా క్లారిటీ ఇచ్చారు.

కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనడం కాదు.. నిజంగా వాళ్లను కెప్టెన్‌లా ఎంతమంది హీరోలు ట్రీట్ చేస్తున్నారు..? కథలో వేలు కాళ్లు పెట్టకుండా చెప్పింది చెప్పినట్లు చేస్తున్నారు. నిన్నగాక మొన్నొచ్చిన కుర్ర హీరోలు కూడా మార్పులు చెప్తుంటే.. ఫలితం తేడా కొట్టాక ఆ బాధ్యత ఒక్క డైరెక్టర్ మాత్రమే ఎందుకు తీసుకోవాలనేది విశ్లేషకుల వాదన. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారో..?

మరిన్ని సినిమా వార్తల కోసం..