AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: దిల్ రాజు అల్లుడు కారు చోరీ.. దొంగతనం చేసిన వ్యక్తి చెప్పింది విని పోలీసులు షాక్..!

అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి దగ్గర కూడా కాస్ట్లీ కార్లు ఉన్నాయి. తాజాగా ఆయనకు చెందిన ఓ కాస్ట్లీ కారు చోరీ జరిగింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు, బడా హీరోల సినిమాలతో పాటు కుర్ర హీరోలతోను సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న గేమ్ చెంజర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Dil Raju: దిల్ రాజు అల్లుడు కారు చోరీ.. దొంగతనం చేసిన వ్యక్తి  చెప్పింది విని పోలీసులు షాక్..!
Dil Raju
Rajeev Rayala
|

Updated on: Oct 14, 2023 | 11:35 AM

Share

సినిమా సెలబ్రెటీల దగ్గర కాస్ట్లీ కారులు ఉండటం చాలా కామన్. కొంతమందికి కార్లు అంటే పిచ్చి. రకరకాల కార్లు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి దగ్గర కూడా కాస్ట్లీ కార్లు ఉన్నాయి. తాజాగా ఆయనకు చెందిన ఓ కాస్ట్లీ కారు చోరీ జరిగింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు, బడా హీరోల సినిమాలతో పాటు కుర్ర హీరోలతోను సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న గేమ్ చెంజర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి భర్త అర్చిత్ రెడ్డి కారు చోరీకి గురైంది.

అర్చిత్ రెడ్డి చెందిన కాస్ట్లీ కారు పోర్షే కారును దొంగలించారు. దీని ధర సుమారు 1.7 కోట్లు. కారు చోరీకి గురికావడంతో అర్చిత్ రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే కారును దొంగలించిన వ్యక్తిని కనిపెట్టారు.

శుక్రవారం ఉదయం అర్చిత్ రెడ్డి హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఆయన తన కారును బయటనే పార్కింగ్ చేశారు. ముప్పై నిమిషాల తర్వాత బయటకు వచ్చి చూస్తే కారు కనిపించలేదు. దాంతో ఆయన వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు దొంగలించిన వ్యక్తిని గుర్తించారు. జూబ్లీహిల్స్‌  పోలీసులు వెంటనే ట్రాఫిక్ పోలీసులను అలర్ట్ చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా కారును కనిపెట్టారు. జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ దాటడంతో వెంటనే కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర ఉన్న పోలీసులను అలర్ట్ చేశారు. దాంతో దొంగ దొరికిపోయాడు. మన్సూరాబాద్‌ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు పోలీసులు. అయితే కారును ఎందుకు దొంగతనం చేశాడో చెప్పమంటే అతను చెప్పిన దానికి పోలీసులు షాక్ తిన్నారు. తనను మంత్రి కేటీఆర్ ఈ కారు తీసుకురమ్మన్నారు అని అందుకే తీసుకు వెళ్తున్నా అని చెప్పాడు. అంతే కాదు తాను ఆకాష్ అంబానీకి సహాయకుడిని అని ఇప్పుడు అర్జెంట్ గా హృతిక్ రోషన్ ను కలవాలి నేను వెళ్ళాలి వదిలేయండి అంటూ పోలీసులకు చెప్పాడట అతను. దాంతో పోలీసులు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదు అని.. చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..