Singer Mangli: ‘అసలు జరిగిందిదే.. వాటిని నమ్మొద్దు’.. కారు ప్రమాదంపై స్పందించిన సింగర్ మంగ్లీ

హైదరాబాద్‌- బెంగళూరు హైవేపై వస్తోన్న మంగ్లీ కారును ఓ డీసీఎం వ్యాను వెనక నుంచి ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు సింగర్ మంగ్లీ. ఇదే ఘటనలో మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై పలు యూబ్యూట్ ఛానెల్స్, వెబ్ సైట్లలో రకరకాల కథనాలు వస్తున్నాయి.

Singer Mangli: అసలు జరిగిందిదే.. వాటిని నమ్మొద్దు.. కారు ప్రమాదంపై స్పందించిన సింగర్ మంగ్లీ
Tollywood Singer Mangli

Updated on: Mar 18, 2024 | 6:30 PM

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ కారు ప్రమాద వార్త టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంచలనగా మారింది. హైదరాబాద్‌- బెంగళూరు హైవేపై వస్తోన్న మంగ్లీ కారును ఓ డీసీఎం వ్యాను వెనక నుంచి ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు సింగర్ మంగ్లీ. ఇదే ఘటనలో మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై పలు యూబ్యూట్ ఛానెల్స్, వెబ్ సైట్లలో రకరకాల కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మంగ్లీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు. వీటిపై స్పందించిన మంగ్లీ సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. ఇది రెండు రోజుల క్రితం అనుకోకుండా జరిగిన ఒక చిన్న ప్రమాదం. దయచేసి ఈ సంఘటన గురించి వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మకండి. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అని ఇన్‌ స్టా గ్రామ్ లో రాసుకొచ్చింది మంగ్లీ. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మంగ్లీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్..

పోలీసులు అందించిన సమాచార ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి మేఘ్ రాజ్, మనోహర్ తో కలిసి తన కారులో హైదరాబాద్ కు బయలు దేరింది మంగ్లీ. తొండుపల్లి వంతెన వద్దకురాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వ్యాన్‌ వెనక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగం దెబ్బతింది. డీసీఎం డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని ప్రచారం సాగుతోంది.

ఇవి కూడా చదవండి

సింగర్ మంగ్లీ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

సింగర్ మంగ్లీ క్లాసికల్ డ్యాన్స్.. వీడియో

ఇషా మహా శివరాత్రి సంబరాల్లో సింగర్ మంగ్లీ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..