టాలీవుడ్‌లో మళ్లీ సందడి షురూ అయ్యింది. కరోనా కారణంగా సినీఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ లు, షూటింగ్ లు అన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తరువాత సినిమా యాక్టివిటీ నెమ్మదిగా మొదలవుతోంది. మరో పదిహేను రోజుల్లో థియేరట్లకు కూడా అనుమతి వస్తుందన్న ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలో వాయిదా పడ్డ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు స్టార్ హీరోలు బరిలో దిగకపోయినా… యంగ్ జనరేషన్ స్టార్స్ మాత్రం రెడీ టు హిట్ ద స్క్రీన్స్ అంటున్నారు. నాని నటిస్తున్న టక్ జగదీష్, నాగ చైతన్య సాయి పల్లవిలా లవ్ స్టోరీ…దగ్గుబాటి రానా ఉద్యమ నేపథ్యం సినిమా విరాటపర్వం, వెంకీ రీమేక్ సినిమా నారప్ప లాంటివి రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయిన తరువాత పోస్ట్ పోన్ అయ్యాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా కూడా వాయిదా పడ్డా.. ఇంకా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. సో… ఆచార్య రిలీజ్ ఇప్పట్లో లేకపోయినా.. మిగత సినిమాలు మాత్రం రిలీజ్‌కు రెడీ అయ్యే ఛాన్స్ ఉంది.
జూలైలోనే థియేటర్లు తెరుచుకున్నా పూర్తి స్థాయిలో ఆడియన్స్ వస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. దసరా వరకు ఆగుదామంటే… ఆ టైమ్‌కి పెద్ద సినిమాలు రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి. అందుకే… ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మీడియం రేంజ్ హీరోలు థియేటర్లకు క్యూ కడతారన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :