Pawan Kalyan: స్నేహితులకు, అభిమానించే వ్యక్తులకు పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్..

పవన్ ప్రతి ఏడాది తన కో స్టార్స్ కో మామిడిపళ్ళు పంపుతారన్న విషయం తెలిసిందే. తన తోటలో పండిన మామిడి పండ్లను పలువురు సినీ ప్రముఖులకు పంపుతూ ఉంటారు పవన్.

Pawan Kalyan: స్నేహితులకు, అభిమానించే వ్యక్తులకు పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్..
Pawan Kalyan

Updated on: Dec 24, 2022 | 7:52 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికలకోసం సిద్దమవుతున్న పవన్.. మరోవైపు తన సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు . ప్రస్తుతం పవన్ కళ్యాణ్  హిస్టారికల్ మూవీ హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే . క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. ఇక పవన్ ప్రతి ఏడాది తన కో స్టార్స్ కో మామిడిపళ్ళు పంపుతారన్న విషయం తెలిసిందే. తన తోటలో పండిన మామిడి పండ్లను పలువురు సినీ ప్రముఖులకు పంపుతూ ఉంటారు పవన్. అలాగే క్రిస్మస్ సందర్భంగానూ గిఫ్ట్స్ పంపుతూ ఉంటారు. తాజాగా పవన్ కొంతమంది సినీ ప్రముఖులకు క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించారు.

మొన్నటివరకు ఫామ్ హౌస్ నుంచి మామిడి పండ్లను పంపించిన పవన్.. ఈ మధ్యనే క్రిస్మస్ గిఫ్ట్స్ పంపడం మొదలు పెట్టారు. ఇండస్ట్రీలో తన స్నేహితులకు, అభిమానించే వ్యక్తులకు పవన్ఫ్ క్రిస్మస్గిఫ్ట్స్ పంపించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం తనతో కలిసి పని చేస్తోన్న దర్శకులకు ఈ గిఫ్ట్స్ ను అందించారు పవన్.

ఇవి కూడా చదవండి

కాగా పవన్ తో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీ రామ్ కు పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించారు. ఈ విషయాన్నీ వేణు శ్రీరామ్ సతీమణి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక పవన్ సినిమాలకు వస్తే ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న హరిహర వీరమల్లు సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా వెళ్లనుంది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేయనున్నారు పవన్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.