AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: ఆ సినిమా తర్వాత నీ రేంజ్ ఎక్కడో ఉంటుందని అన్నారు.. : గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గోపీచంద్33లో నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు

Gopichand: ఆ సినిమా తర్వాత నీ రేంజ్ ఎక్కడో ఉంటుందని అన్నారు.. : గోపీచంద్
Gopichand
Rajeev Rayala
|

Updated on: Sep 10, 2026 | 12:52 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు గోపీచంద్. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు గోపీచంద్. తన నట ప్రస్థానంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో, ఆయన తన కెరీర్‌లోని మైలురాళ్లను, కొన్ని ప్రత్యేకమైన అనుభవాలను పంచుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా అత్యంత ఇష్టపడే చిత్రాలలో జయం మొదటి స్థానంలో నిలుస్తుందని, ఆ తర్వాత యజ్ఞం, రణం, లక్ష్యం వంటి సినిమాలు తనకు సంతృప్తినిచ్చాయని తెలిపారు. లౌక్యం వంటి ఎంటర్‌టైనర్‌లను కూడా ఆయన ప్రస్తావించారు.

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

ముఖ్యంగా జయం సినిమా గురించి మాట్లాడుతూ.. అందులో తాను పోషించిన విలన్ పాత్ర అప్పటికి తనకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని వివరించారు. ఆ సమయంలో తాను ఆ పాత్రను విలన్‌గా చూడలేదని, కేవలం హీరోగానే అనుకున్నా అని అలాగే ఎదురుగా ఉన్న హీరోని నేను విలన్ అనుకోని నటించా అని తెలిపారు. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రగానే భావించి నటించానని గోపీచంద్ వెల్లడించారు. అయితే, ఆ సినిమా షూటింగ్ సమయంలో, ముఖ్యంగా చివరి రోజున, డైరెక్టర్ తేజ తనకు ఇచ్చిన సలహా తన సినీ జీవితాన్ని ఒక మలుపు తిప్పిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

తేజ తనతో మాట్లాడుతూ.. గోపి నువ్వు తొందరపడొద్దు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ రేంజ్ ఎక్కడ ఉంటుందో నీకు తెలియదు. నిన్ను నువ్వు విలన్‌గా అనుకోవద్దు. కొంచెం ఆగు, తొందరపడి ఏది పడితే అది ఒప్పుకోవద్దు,” అని చెప్పిన మాటల తనకు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపారు. జయం సినిమా విడుదలైన తర్వాత, మొదట హీరోయిన్‌కు, ఆ తర్వాత తన రఘు క్యారెక్టర్‌కు ఊహించని రీతిలో ప్రజాదరణ లభించిందని గోపీచంద్ వివరించారు.

ఇవి కూడా చదవండి

BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us