
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి హీరో, హీరోయిన్స్ సినిమాల విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ ఎవరు ప్రేమలో ఉన్నారు, ఎవరితో షికారుకు వెళ్తున్నారు అనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్, డైరెక్టర్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా ఈ ఇద్దరూ కలిసి పండగ జరుపుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.?
తెలుగులో ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది నటి ఈషా రెబ్బా. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించలేకపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..ఈషా రెబ్బ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక సక్సెస్ కాలేక పోయినా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించి మెప్పించింది.
ఈ బ్యూటీ చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా.. స్పెషల్ రోల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్‌లోనూ నటించింది. త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. కానీ ఈ బ్యూటీకి అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఇదిలా ఉంటే దర్శకుడు తరుణ్ భాస్కర్ తో ప్రేమలో ఉందని వార్తలు చక్కరకొడుతున్నాయి. ఈ ఇద్దరూ కలిసి గతంలో తిరుమలకు వెళ్లారు. అప్పుడు వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక తాజగా ఈ ఇద్దరూ కలిసి దీపావళి జరుపుకున్నారు. విశ్వక్ సేన్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి కనిపించారు. దాంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.