Rakesh Master: ‘తనను సమాధి ఎక్కడ చేయాలో ముందే కోరిన రాకేశ్ మాస్టర్’

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో..

Rakesh Master: 'తనను సమాధి ఎక్కడ చేయాలో ముందే కోరిన రాకేశ్ మాస్టర్'
Rakesh Master
Follow us

|

Updated on: Jun 19, 2023 | 9:03 AM

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. జూన్ 19న బోరబండలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు. ఇదిలా ఉంటే.. గతంలో ఆయన కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ‌లలో చేసిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

ఆ ఇంటర్వ్యూలో తన అంతిమయాత్ర ఎలా ఉండాలో, ఎలా సమాధి చేయాలో చూసుకునేందుకు ఓ వీడియో ముందే తీశానని చెప్పారు రాకేశ్ మాస్టర్. తన మామగారి(భార్య తండ్రి) సమాధి పక్కన ఓ వేప మొక్క నాటానని.. తన మరణాంతరం ఆ చెట్టు కిందే తనను సమాధి చేయాలని ఓ ఇంటర్వ్యూలో కోరారు రాకేశ్ మాస్టర్. అమ్మ, తమ్ముడు అంటే తనకు చాలా ఇష్టమని.. వాళ్లు చనిపోయిన తర్వాత జీవితంపై విరక్తి పుట్టిందని చెప్పేవారు. తండ్రి, తన అక్క కొడుకు మరణించిన తర్వాత.. చావుపైనే భయం లేకుండాపోయిందని చెబుతూ రాకేశ్ మాస్టర్ ఆ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు.