Jani Master: జానీ మాస్టర్‌ కేసులో బయటకు వస్తున్న సంచలన విషయాలు..

| Edited By: TV9 Telugu

Sep 19, 2024 | 6:02 PM

జానీ మాస్టర్‌ పై సైబరాబాద్ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేశాడు. ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ మాస్టర్ గా చేశాడు. సూపర్ హిట్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేయించి మెప్పించాడు.

Jani Master: జానీ మాస్టర్‌ కేసులో బయటకు వస్తున్న సంచలన విషయాలు..
Jani Master
Follow us on

జాతీయ అవార్డు గెలుచుకున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు.   కొరియోగ్రాఫర్ గా చాలా పాపులర్ అయ్యాడు జానీ మాస్టర్. జానీ మాస్టర్‌ పై సైబరాబాద్ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేశాడు. ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ మాస్టర్ గా చేశాడు. సూపర్ హిట్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేయించి మెప్పించాడు. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ భాషల్లోనూ కొరియోగ్రాఫ్ చేసి పాపులర్ అయ్యాడు జానీ మాస్టర్. ఇదిలా ఉంటే జానీ మాస్టర్‌తో కలిసి పనిచేస్తున్న 21 ఏళ్ల యువతి ఆయన  ఆరోపణ చేసింది. చాలా ఏళ్లుగా జానీ మాస్టర్‌తో కలిసి పని చేస్తుంది ఆమె. వివిధ కార్యక్రమాల నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన తనతో జానీ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని బయటపెడితే ఇబ్బంది పెడతానని బెదిరించాడని యువతి ఆరోపించింది.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసినట్టు. ఆదివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో హరికృష్ణారెడ్డి తెలిపారు. ఇక జానీ మాస్టర్‌ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సదరు యువతికి జానీ మాస్టర్‌కు ఢీ 12 షోలో పరిచయమైంది. ఆ తరువాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ ఇచ్చారు జానీ మాస్టర్‌. ముంబై సహా పలు ఔట్‌ డోర్‌ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు జానీ మాస్టర్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిందామె. అంతేకాదు నార్సింగిలో తన ఇంట్లో కూడా లైంగిక దాడి చేశాడన్నారామె. జానీ మాస్టర్‌ భార్య తన ఇంటికొచ్చి తనపై దాడి చేసిందన్నారు.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

యువతి స్టేట్‌మెంట్‌ తీసుకున్న ముగ్గురు పోలీసులు బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారణ జరిపారు. అనంతరం బాధితురాలిని భరోసాకేంద్రానికి తీసుకెళ్లారు పోలీసులు. అలాగే బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించనున్నారు. జానీ మాస్టర్‌ షూటింగ్‌ సమయంలో.. తన వ్యాన్‌లోకి వచ్చి బలవంతం చేశాడని, లైంగికంగా నన్ను ఎంతో వేధించాడని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని బయటపెడితే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడుని  మతం మార్చుకుని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టాడన్నారు. తన మాట వినకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.  లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో జానీ మాస్టర్‌పై జనసేన యాక్షన్‌ చేపట్టింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..? అసలు విషయం బయటపెట్టిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.