అల్లు అరవింద్, సుకుమార్, మారుతి చేతుల మీదుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘బేబీ’ ప్రారంభం!!

న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న 'బేబీ' చిత్రంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించునున్నారు.

అల్లు అరవింద్, సుకుమార్, మారుతి చేతుల మీదుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీ 'బేబీ' ప్రారంభం!!
Anand

 

న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న ‘బేబీ’ చిత్రంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించునున్నారు. ఈ సందర్బంగా చిత్రం బృందాన్ని అభినందిస్తూ నిర్మాత అల్లు అరవింద్ మొదటి క్లాప్ ఇచ్చారు, సుకుమార్ కెమెరా ఆన్ చేయగా, డైరెక్టర్ మారుతి మొదటి షాట్ డైరెక్ట్ చేసారు. ఈ రోజుల్లో,భలే భలే మగాడివోయ్, మహానుభావుడు,ప్రతి రోజు పండగే లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలలో నిర్మాణ భాగస్వామి గా ఉండి, విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా మూవీ ని సొంతంగా నిర్మించి విజయాన్ని అందుకున్న ఎస్. కె. ఎన్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు.

చిత్ర నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ అధినేతలు ఎస్. కే. ఎన్ & మారుతి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ షూట్ ఈ నెల 20 నుండి ప్రారంభం కానుందని చెప్పారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తుండగా రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.ఈ చిత్రానికి 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే,పుష్ప లాంటి భారీ చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కార్తిక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu