Actress Sneha: వింత సమస్యతో బాధపడుతోన్న స్నేహ.. షాకింగ్ విషయం బయటపెట్టిన భర్త ప్రసన్న

|

Mar 14, 2025 | 1:14 PM

నటి స్నేహ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సావిత్రి, సౌందర్య తర్వాత ఆ స్థాయిలో హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుందీ అందాల తార. గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ అందాల తార ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజి బిజీగా గడుపుతోంది.

Actress Sneha: వింత సమస్యతో బాధపడుతోన్న స్నేహ.. షాకింగ్ విషయం బయటపెట్టిన భర్త ప్రసన్న
Actress Sneha
Follow us on

సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతుండగానే నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది స్నేహ. 2012 మే 11న వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైయిన తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది స్నేహ. అయితే రామ్ చరణ్ వినయవిధేయ రామ సినినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. గత ఏడాది వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో ‘గోట్’ సినిమాలో విజయ్ దళపతి భార్యగా నటించింది. ఇక గత నెలలో రిలీజై సంచలన విజయం సాధించిన ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది. ఇక తమిళ్‌లోనూ పలు టీవీ షోల్లో సందడి చేస్తోందీ అందాల తార. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్నేహ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదే సమయంలో తనకున్న ఓ అరుదైన సమస్య గురించి కూడా చెప్పింది. తనకు ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) సమస్య ఉందని తెలిపింది.

 

ఇవి కూడా చదవండి

నాకు OCD అనే సమస్య ఉంది. నాకు ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా కిచెన్ క్లీన్‌గా ఉండాలని కోరుకుంటాను. ఈ OCD సమస్య అరుదైనదే అయినా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటాను’ అని చెప్పుకొచ్చింది స్నేహ. దీనికి ఆమె భర్త, నటుడు ప్రసన్న స్పందిస్తూ.. ‘ ఇంట్లో అది బాలేదు ఇది బాలేదు అంటూ 3 సార్లు మార్చింది. ఇక ఆమె మార్చకుండా ఉన్నది నన్ను ఒక్కడినే’ అంటూ సెటైర్ వేశాడు.

గ్లామరస్ లుక్ లో నటి స్నేహ.. లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..


కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కుర్ర హీరో, హీరోయిన్లకు వదినగా, అక్క పాత్రలలో నటిస్తోంది స్నేహ. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన ఫ్యామిలీ ఫోటోస్, క్రేజీ ఫోటోషూట్స్ ను అందులో షేర్ చేస్తుంటుంది.

వెకేషన్ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో స్నేహ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.