AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanvi Srivastava: లవ్లీ హీరోయిన్‏కు తీవ్రమైన కడుపునొప్పి.. స్కానింగ్ రిపోర్ట్స్ చూసి షాక్.. డాక్టర్స్ ఏమన్నారంటే..

మరాఠీలో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉన్న శాన్వి మిగతా భాషలలో మాత్రం సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ర్యాపిడ్ రష్మీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా గతేడాది డిసెంబర్ లో తన జీవితంలో గడిచిన అత్యంత కష్టమైన రోజు గురించి చెప్పుకొచ్చింది.

Shanvi Srivastava: లవ్లీ హీరోయిన్‏కు తీవ్రమైన కడుపునొప్పి.. స్కానింగ్ రిపోర్ట్స్ చూసి షాక్.. డాక్టర్స్ ఏమన్నారంటే..
Shanvi Srivastava
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2024 | 4:19 PM

Share

లవ్లీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ. యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ఈ మూవీ 2012లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ శాన్వికి మాత్రం ఆశించినంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. తెలుగు ఆడపాదడపా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి కన్నడలో మాత్రం మంచి ఆఫర్స్ వచ్చాయి. యష్, దర్శన్, గణేశ్, రక్షిత్ శెట్టి వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగం మరాఠీలో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉన్న శాన్వి మిగతా భాషలలో మాత్రం సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ర్యాపిడ్ రష్మీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా గతేడాది డిసెంబర్ లో తన జీవితంలో గడిచిన అత్యంత కష్టమైన రోజు గురించి చెప్పుకొచ్చింది.

డిసెంబర్ 8 శాన్వి శ్రీవాస్తవ పుట్టినరోజు. కానీ ఆ తర్వాత రోజు తన జీవితంలో అత్యంత కష్ట సమయం వచ్చిందని తెలిపింది. డిసెంబర్ 9న తనకు ఆకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని.. ఒక్క అంగుళం కూడా కదలలేనంతగా భరించలేని నొప్పి వచ్చిందని తెలిపింది. దీంతో తన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా.. పరీక్షించిన డాక్టర్ తనను వెంటనే ఎంఆర్ఐ, క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారని చెప్పుకొచ్చింది. క్యాన్సర్ టెస్ట్ అనగానే తన మనసు చెదిరిపోయిందని.. క్యాన్సర్ ఉంటే ఎలా.. ? నొప్పి, వరుస ఆపరేషన్లు, కీమోథెరపీ వల్ల భరించలేని నొప్పి, జుట్టు రాలడం ఇలా అన్ని సమస్యలు ఒక్కక్షణం తన కళ్ల ముందుకు వచ్చాయని తెలిపింది.

ఆ తర్వాత పరీక్షల రిపోర్ట్స్ వైద్యులకు చూపిస్తే క్యాన్సర్ సమస్య కాదని.. అండాశయాలపై తిత్తులు ఏర్పడ్డాయని.. అందులో కొన్ని విరిగిపోయి అండాశయాలు కూడా దెబ్బతిన్నాయి. కానీ ఇది క్యాన్సర్ కాదు, కానీ దీర్ఘ చికిత్స అవసరమని వైద్యులు చెప్పినట్లు గుర్తుచేసుకుంది. డిసెంబర్ నుంచి పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్, సప్లిమెంట్స్ తీసుకున్నట్లు తెలిపింది. కొన్ని రకాల మందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని.. గత నాలుగు నెలలుగా శ్యాసకు సంబంధించిన వ్యాయమాలపై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది.తన జీవితంలో, కెరీర్ లో ఎన్ని సవాళ్లు ఎదురైన ధైర్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.