
స్టార్ హీరోయిన్ సమంత గురించి, ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతుంది. హీరోయిన్ గానే కాదు ప్రొడ్యూసర్ గానూ సమంత అదరగొడుతుంది. ఇప్పుడున్న భామల్లో చాలా మంది పాన్ ఇండియన్ హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే.. తాను కూడా రేస్ కు రెడీ అంటూ సిద్దమవుతుంది సామ్. మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. సమంతకు తెలుగు, తమిళ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యశివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటించింది.
ఈ చిత్రంలో నటుడు విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది ఈ అమ్మడు.. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత నటి సమంత అనారోగ్య సమస్యలతో సినిమాల్లో సినిమాలకు దూరం అయ్యింది.గత సంవత్సరం 2024లో సమంత ఒక్క సినిమాలో మాత్రమే కనిపించింది. సమంత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జనాలు, అభిమానులు కూడా సమంతకు మద్దతు తెలిపారు.
ఇక ఇప్పుడు కోలుకొని తిరిగి సినిమాలు చేస్తుంది. అలాగే తానే ప్రొడ్యూసర్ గా చేసిన శుభం అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తుంది. అలాగే పలు కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ” నా ఇరవయ్యేళ్ల వయసులో రెస్ట్ అనేది లేకుండా బిజీ బిజీగా గందరగోళంలో గడిపాను. అలాగే గుర్తింపు కోసం ఆరాటపడ్డాను. నా లోపలి ఫీలింగ్స్ ఏవీ పైకి కనిపించకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాను. మరో వైపు నన్ను నేను ఎంతో కోల్పోయాను. పైకి ఒకలా.. లోపల మరోలా ఉండేదాన్ని ప్రేమ గురించి నాకెవరూ చెప్పలేదు. కానీ నిజమైన ప్రేమ మనలోనే దాగి ఉంటుందని, మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని ఆ తర్వాత అర్థం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సమంత ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.