AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murali Naik: ఈ టాలీవుడ్ హీరోయిన్ మనసూ అందమైనదే.. అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం.. వీడియో

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించింది. తనకు తోచినంత ఆర్థిక సాయం చేసింది.

Murali Naik: ఈ టాలీవుడ్ హీరోయిన్ మనసూ అందమైనదే.. అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం.. వీడియో
Murali Naik
Basha Shek
|

Updated on: May 23, 2025 | 12:46 PM

Share

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కొన్ని రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లో సైనికుడిగా విధులు నిర్వహిస్తోన్న మురళీ నాయక్ అమరుడయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లి తాండ గ్రామానికి చెందిన మురళీ పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సైనికుడిగా దేశానికి సేవ చేయాలని 2022లోఅగ్నివీర్ గా సైన్యంలో ఆర్మీలో చేరాడు మురళీ నాయక్. ఆపరేషన్ సింధూర్ ముందు వరకు వేరే చోట పనిచేస్తోన్న ఈ జవాన్ భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో కశ్మీర్ కు వచ్చాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పహరా కాస్తూ శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు మురళీ. ఈ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. కాగా మురళీ నాయక్‌కు నివాళి అర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతని స్వగ్రామానికి తరలి వస్తున్నారు. అతని తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మిత్రా శర్మ మురళీ నాయక్ ఇంటికి వెళ్లింది. అతని సమాధి దగ్గర నివాళులు అర్పించింది.

కళ్లితాండలో ఉన్న మురళీ తల్లిదండ్రులని కలిసి ధైర్యం చెప్పింది మిత్రా శర్మ. దేశం ఒక గొప్ప వీరుడ్ని కోల్పోయిందని.. ఇలాంటి వీరుడి కుటుంబానికి దేశమంతా ఎప్పటికీ అండగా ఉంటుందని మిత్రా శర్మ పేర్కొంది. ఈ సందర్భంగా మురళీ తల్లిదండ్రులకు తనకు తోచిన ఆర్థిక సాయం కూడా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందీ టాలీవుడ్ హీరోయిన్. ‘ మనం గొప్ప వీరుడ్ని కోల్పోయాం’ అని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు మిత్రా శర్మని ప్రశంసిస్తున్నారు. ఒక చిన్న హీరోయిన్ అయినా చాలా గొప్ప పని చేసిందంటూ మిత్రా శర్మకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మురళీ నాయక్ తల్లిదండ్రులతో టాలీవుడ్ హీరోయిన్..

View this post on Instagram

A post shared by Mitraaw (@mitraaw_sharma)

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది మిత్రా శర్మ. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఇటీవల మిత్రా నటించిన కొత్త చిత్రం వర్జిన్ బాయ్స్ టీజర్ కూడా రిలీజైంది. ఈ సినిమాలో శ్రీహాన్ హీరోగా నటించాడు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

పేదలకు ఆర్థిక సాయం..

View this post on Instagram

A post shared by Mitraaw (@mitraaw_sharma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?