Archana Shastry:”నాకు పెళ్లయిందని ఓ నిర్మాత ఆ మాట అన్నారు”.. అర్చన ఆసక్తికర కామెంట్స్
అల్లరి నరేష్ నటించిన నేను సినిమాతో మంచి గుర్తింపు తెక్చుకుంది హీరోయిన్ అర్చన(Archana Shastry). ఆ తర్వాత పలు సినిమాలో నటించి మెప్పించింది ఈ అమ్మడు. తెలుగమ్మాయి అయిన అర్చన కన్నడలోనూ సినిమాలు చేసింది.
అల్లరి నరేష్ నటించిన నేను సినిమాతో మంచి గుర్తింపు తెక్చుకుంది హీరోయిన్ అర్చన(Archana Shastry). ఆ తర్వాత పలు సినిమాలో నటించి మెప్పించింది ఈ అమ్మడు. తెలుగమ్మాయి అయిన అర్చన కన్నడలోనూ సినిమాలు చేసింది. ఆ తర్వాత పలుసినిమాల్లో కీలక పాత్రల్లో.. చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది అర్చన.ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన రామదాసు సినిమాలో సీత పాత్రలో నటించి చక్కటి అభినయాన్ని కన్బబరిచింది ఈ భామ. అయితే అర్చన పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించింది. మొన్నామధ్య మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో కనిపించింది అర్చన. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అర్చన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకు చాలా సందర్భాల్లో కోపం వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఏదైనా నచ్చకపోతే వెంటనే మొఖంమీద చెప్పేస్తున్నా అని అన్నారు. ఇక నేను తెలుగు అమ్మాయిని, భాష చక్కగా మాట్లాడగలుగుతా.. డాన్స్ చేస్తా , యాక్టింగ్ చేస్తా నా నటన బాగానే ఉంటుందని అనుకుంటున్నా. నా కుటుంబం నాకు ఎంతో సపోర్ట్ చేసింది అన్నారు. అయితే ఇండస్ట్రీలో కొన్ని మాటలు తనను బాధించాయని అన్నారు. ఇటీవల ఓ నిర్మాత అర్చనకు పెళ్లయిపోయింది ఎందుకు ఆమెకు అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని అన్నారు. అది నాకు నచ్చలేదు. ఇప్పుడు ఫీమెల్ సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. సిల్లీ ఫెలోస్ అన్ని చోట్లా ఉంటారు. వాళ్ళగురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆడదాన్ని విక్టిమ్ గా.. అలాగే మగవాడిని ఎంపవర్ స్టేట్ లో సొసైటీ చూస్తోంది. కానీ నేనలా చూడనని అర్చన చెప్పుకొచ్చారు. రంగస్థలం సినిమా నాకు చాలా నచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలోనూ ఆడవాళ్లకు చాలా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చింది అర్చన.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి