Rashmika Mandanna: ఎంటమ్మ అంతమాట అనేశావ్.. రష్మికాను ఆడేసుకుంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

అందాల భామ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని దక్కించుకుంది.

Rashmika Mandanna: ఎంటమ్మ అంతమాట అనేశావ్.. రష్మికాను ఆడేసుకుంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
Rashmika
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2022 | 11:11 AM

అందాల భామ రష్మిక మందన్న(Rashmika Mandanna)క్రేజ్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ తోపాటు తమిళ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మన దగ్గర బడా హీరోల సరసన నటిస్తోంది ఈ అమ్మడు. ఇప్పటికే మహేష్ బాబు సరనస సర్కారు వారి పాట.. అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప సినిమాల్లో నటించింది రష్మిక. ప్రస్తుతం పుష్ప 2 లో చేస్తోంది. అలాగే రీసెంట్ గా సీతారామం సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ బ్యూటీ. అయితే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది రష్మిక. తాజాగా రష్మికను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

రీసెంట్ గా అల్లు అర్జున్ ఓ యాడ్ కోసం తన స్టైల్ మొత్తని మార్చేసిన విషయం తెలిసిందే. ఓ యాడ్ కోసం బన్నీ సూపర్ స్టైలిష్ లుక్ లోకి మారారు. లైట్ గా నెరిసిన జుట్టు, గడ్డం , నోట్లో సిగార్ తో బన్నీ లుక్ అదిరింది. ఈ లుక్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బన్నీ అభిమానులు ఈ లుక్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ నయా లుక్ పై రష్మిక చేసిన కామెంట్ ఇప్పుడు అమ్మడిని ట్రోల్స్ వలలో పడేలా చేసింది. రష్మిక స్పందిస్తూ.. “సార్ మిమ్మల్ని ఒక్క క్షణం గుర్తుపట్టలేక పోయాను” అంటూ కామెంట్ చేసింది. దాంతో బన్నీ అభిమానులు రష్మిక పై సీరియస్ అవుతున్నారు. తనతో నటించిన హీరోను కూడా గుర్తుపట్టలేదా..? ఇది మరీ ఓవరాక్షన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. తెలుగు హీరోల కంటే హిందీ హీరోల మొఖాలే నీకు గుర్తుంటాయా..? అంటూ విరుచుకుపడుతున్నారు. అల్లు అర్జున్ ను గుర్తుపట్టకపోవడం దారుణం ఇది కాస్త ఓవర్ గా ఉంది.. అంటూ  ఇప్పటికి కూడా రష్మిక పైన ట్రోల్స్ చేస్తున్నారు బన్నీ ఆర్మీ.