Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పవిత్ర స్నానం.. ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ నటి.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు అట్టహాసంగా జరిగింది. సుమారు 60 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమయ్యారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పవిత్ర స్నానం.. ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ నటి.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Mar 02, 2025 | 11:27 AM

ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మక వేడుకగా గుర్తింపు పొందిన ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ముగిసింది. సుమారు 45 రోజుల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 60 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సామాన్య భక్తులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మహా కుంభమేళాలో భాగమయ్యారు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎంతో మంది పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ క్రమంలోనే టాలీవుడ ప్రముఖ నటి మంచు లక్ష్మి తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాగరాజ్ కు వెళ్లింది. అక్కడ మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించింది. తాజాగా ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ‘నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో మైలురాయి’ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టిం వైరలవుతున్నాయి.

కాగా సినిమా పరిశ్రమ నుంచి ఉపాసన కొణిదెల, బ్రహ్మాజీ, విజయ్ దేవరకొండ, హేమ మాలినీ, సంయుక్త మేనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్య వంశీ, రాజ్ కుమార్ రావు, సోనాల్ చౌహాన్ తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. వీరి ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో మంచు లక్ష్మి..

ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోందామె. ఎక్కువగా ముంబైలోనే ఉంటోన్న ఆమె సోషల్ మీడియా ద్వారా మాత్రమే అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోందీ మంచు వారమ్మాయి

కూతురితో మంచు వారమ్మాయి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.