ఆ ఒక్క తప్పే ప్రాణం తీసింది.. లేకుంటే స్టార్ హీరో అయ్యేవాడు.. అచ్యుత్ మరణానికి అదే కారణమా.?
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది నటీనటులు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ గా ఉంటున్న సమయంలోనే హఠాన్మరణం చెందారు. అలాంటి వారిలో అచ్యుత్ ఒకరు. ఈ నటుడి గురించి ఈతరం ఆడియెన్స్ కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ 1990-2000 జనరేషన్ ఆడియెన్స్ కు ఇతను ఫేవరెట్ యాక్టర్

తెలుగులో సహాయక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అచ్చుత్. సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు అచ్యుత్ కానీ చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. మెగాస్టార్ చిరంజీవితో బావగారు బాగున్నారా.?, పవన్ కళ్యాణ్‌తో తమ్ముడు సినిమాల్లో నటించాడు అచ్యుత్ .. కాగా అచ్చుత్ మరణం గురించి ఆయన మిత్రుడు, సహా నటుడు ప్రదీప్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నటుడు అచ్యుత్ మరణానికి గల అసలు కారణాలతో పాటు, తన గురువు జంధ్యాలగారితో తన అనుబంధం, ఆయన జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న హాస్యోత్సవం గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అచ్యుత్ మరణంపై నెలకొన్న అపోహలపై ప్రదీప్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ
అచ్యుత్ మరణానికి గల కారణాలను వివరిస్తూ, చాలా మంది అనుకుంటున్నట్లుగా అది దురలవాట్ల వల్ల కాదని, అధిక పని ఒత్తిడి అలాగే కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల సంభవించిన గుండెపోటు అని ప్రదీప్ స్పష్టం చేశారు. అచ్యుత్ టీవీ సీరియల్స్‌లో మంచి స్టార్‌డమ్‌లో ఉండటంతో పాటు, తన సొంత ఇండస్ట్రీని కూడా నిర్వహిస్తున్నారని, ఇలా రెండు పనులు ఆయనను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని ప్రదీప్ వివరించారు. నలభై ఏళ్ల వయసులో ఈ ఒత్తిడి శరీరానికి హెచ్చరికలను పంపిందని, అయితే అచ్యుత్ వాటిని గమనించలేకపోయారని ప్రదీప్ తెలిపారు. ‘అచ్యుత్ మరణాన్ని నేను దగ్గరుండి చూసాను. అతను నా చేతుల్లోనే చనిపోయాడు అని తెలిపారు ప్రదీప్.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను
ధూమపానం, మాంసాహారం మానేసిన అచ్యుత్, అధికంగా స్వీట్లు అలాగే థమ్స్ అప్ వంటి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెపోటుకు దారితీసి ఉండవచ్చని ప్రదీప్ అన్నారు. అచ్యుత్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించి ప్రదీప్ గుర్తు చేసుకున్నారు. “మట్టి మనుషులు” సీరియల్‌లో ఇద్దరూ కలిసి నటించారని, ఒకరోజు రాత్రి తామిద్దరం కలిసి మాట్లాడుకున్నారని, మరుసటి రోజు ఉదయం అచ్యుత్‌కు గుండెపోటు వచ్చిందని తెలియగానే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రదీప్ చెప్పారు. తన జీవితంలో అంతగా బాధపడిన సందర్భం లేదని, ఈ విషాదం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్యుత్ మరణించే సమయానికి ఆయనకు సాయి సుజాత, సమిత అనే చిన్న వయసు పిల్లలు ఉన్నారని, వారి కుటుంబం పడిన బాధను ప్రదీప్ వివరించారు.




