AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎందుకు పనికిరాడు అనుకున్నాం.. కానీ స్టార్ హీరో అయ్యాడు..! షాకింగ్ విషయం చెప్పిన చలపతిరావు

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుల్లో చలపతి రావు ఒకరు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు చలపతి రావు. ముఖ్యంగా తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. చలపతిరావు పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించి మెప్పించారు.

ఎందుకు పనికిరాడు అనుకున్నాం.. కానీ స్టార్ హీరో అయ్యాడు..! షాకింగ్ విషయం చెప్పిన చలపతిరావు
Chalapathi Rao
Rajeev Rayala
|

Updated on: Aug 22, 2025 | 1:31 PM

Share

తన విలక్షణ నటనతో ఎంతో మంచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సీనియర్ నటుడు చలపతి రావు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో పోషిచారు చలపతి రావు. ముఖ్యంగా తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. చలపతిరావు పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. కాగా తన చివరి చిత్రం 2021లో విడుదలైన బంగార్రాజు. తెలుగులో దాదాపు అందరు హీరోల సినిమాల్లో నటించారు చలపతిరావు. అంతే కాదు ఎంతో మంది హీరోలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

కాగా గాంతంలో చలపతిరావు ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ హీరో ఎందుకూ పనికిరాకుండా పోతాడని అతని తండ్రి బాధపడ్డాడు అని అన్నారు చలపతి రావు. చలపతి రావు కొడుకు రవిబాబు నటుడు, దర్శకుడు ఈ విషయం అందరికి తెలిసిందే. చలపతి రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లరి సినిమా గురించి చెప్పారు. రవిబాబు వచ్చి అల్లరి సినిమా గురించి చెప్పాడు.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

అప్పుడు నేను హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని అడిగితే ఈవీవీ సత్యనారాయణ గారి రెండో అబ్బాయి అని అన్నాడు నేను ఆశ్చర్యపోయా.. ఎందుకంటే ఈవీవీ గారు నాతో ఎప్పుడు నరేష్ గురించి చెప్తూ ఉంటారు. వీడిని ఎదో ఒకటి చేయాలి ఎందుకూ పనికి రాకుండా పోతాడేమో అనిపిస్తుంది. యాక్టర్ గా పనికిరాడు అని బాధపడేవారు. అలాంటిది రవిబాబు నరేష్ హీరో అనగానే నేను షాక్.. కథకు అతను సెట్ అవుతాడు అని రవిబాబు నన్ను ఒప్పించాడు. సరే అని నేను ఈవీవీ గారిని అడిగాను. ఆయన ముందు నేను జోక్ చేస్తున్నా అనుకున్నాడు. ఫైనల్ గా ఒప్పుకున్నాడు. ఆతర్వాత సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది అని అన్నారు. ఇక నరేష్ విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో  దూసుకుపోతున్నాడు నరేష్. కామెడీ సినిమాలతో పాటు సీరియస్ యాక్షన్ సినిమాలు కూడా చేసి మెప్పిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్