Jr Ntr: శ్రీవారి సన్నిధిలో తారక్‌ కుటుంబం.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న ఫొటోలు..

|

Mar 15, 2022 | 12:22 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి (Srivari Temple) ని దర్శించకున్నారు.

Jr Ntr: శ్రీవారి సన్నిధిలో తారక్‌ కుటుంబం.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న ఫొటోలు..
Jr Ntr Family
Follow us on

జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి (Srivari Temple) ని దర్శించకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి, పిల్లు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌, ఎన్టీఆర్‌ తల్లి శాలిని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయాధికారులు వీరికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం దేవస్థానం అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలు అందించారు. కాగా జూనియర్ ఎన్టీఆర్  (Jr Ntr) ఫ్యామిలీ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుఉతన్నాయి. ముఖ్యంగా క్యూట్‌క్యూట్‌గా ఉన్న తారక్‌ పిల్లల ఫొటోలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఫొటోల్లో ఎన్టీఆర్‌ కనిపించలేదు. ప్రస్తుతం తారక్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ ఇందులో మల్టీస్టారర్లుగా నటించిన సంగతి తెలిసిందే.

కాగా తారక్‌ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, అలియా భట్‌, ఓలివియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియాశరణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలరర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ పనుల్లోనే తారక్‌, చరణ్‌ ఉన్నారు.

Also Read:NIN Hyderabad Jobs: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక…నిన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

చింతపండు గింజలతో అదిరిపోయే అందం మీ సొంతం..

NDMA Jobs 2022: నేషనల్‌ డిజార్డర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం..