ఆ హీరోతో లిప్ కిస్.. దెబ్బకు వాంతులు చేసుకున్న స్టార్ హీరోయిన్.. పైగా వందసార్లు మొఖం కడుక్కుందట

|

Jan 15, 2025 | 6:00 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్కిన్ షోలు, రొమాంటిక్ సీన్స్, అలాగే లిప్ లాక్ లాంటివి చేయకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. అలంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ చిన్నది తన లైఫ్ లో ఒక్కసారి కూడా కిస్సింగ్ సీన్ లో నటించలేదట. అలాగే గతంలో ఓ హీరో తనను ముద్దు పెట్టుకుంటే వాంతులు చేసుకున్నాను అని తెలిపింది.

ఆ హీరోతో లిప్ కిస్.. దెబ్బకు వాంతులు చేసుకున్న స్టార్ హీరోయిన్.. పైగా వందసార్లు మొఖం కడుక్కుందట
Actress
Follow us on

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు కేవలం పాటలకోసమే అన్నట్టుగా ఉంటున్నాయి. అయితే మరికొంతమంది భామలు మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హీరోలతో సమానంగా నటనలోనూ మార్కులు కొట్టేస్తున్నారు. అలాగే గ్లామర్ రోల్స్ కు కూడా దూరంగా ఉంటున్నారు. చాలా మంది భామలు స్కిన్ షో, రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్ లు చేయడానికి నో చెప్పుతున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా కొన్ని కండిషన్స్ పెట్టుకుందట. అయితే ఓ హీరో తనను లిప్ కిస్ పెట్టుకున్నాడని ఏకంగా 100సార్లు మొఖం కడుక్కుందట.. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

సినిమా షూటింగ్ లో అనుకోకుండా ఓ హీరో తనను కిస్ చేసినందుకు వందసార్లు ముఖం కడుక్కున్నా హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ అందాల భామ రవీనా టాండన్. రవీనా టాండన్ బాలీవుడ్ లో ఫెమస్ నటి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లోనూ నటించింది. రీసెంట్ గా కేజీఎఫ్2 సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఆమె గతంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

ఓ సినిమా షూటింగ్ లో తనను రఫ్ గా హ్యాండిల్ చేశారని. ఆ షూటింగ్ లో అనుకోకుండా ఓ హీరో పెదాలు తనపెదాలను తగిలాయని దానితో చాలా ఇబ్బందిపడ్డానని చెప్పుకొచ్చింది. అది కిస్సింగ్ సీన్ కాదు అయినా కూడా అది పొరపాటున జరిగింది. దాంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు వికారంగా అనిపించింది. దాన్ని నేను లైట్ తీసుకోలేకపోయాను.  వెంటనే వెళ్లి వాంతులు చేసుకున్నాను. బ్రష్ చేసుకొని ఓ వందసార్లు మొఖం కడుక్కున్నా అని చెప్పుకొచ్చింది. అలాగే ఆ హీరోకు ఎలాంటి ఉద్దేశం లేదు. షాట్ తర్వాత అతను క్షమాపణ కూడా చెప్పాడు అని తెలిపింది. అలాగే ఇప్పటికీ కూడా తాను ఎప్పుడు కిస్సింగ్ సీన్ లో నటించలేదు అని చెప్పుకొచ్చింది రవీనా టాండన్. త్వరలోనే రవీనా కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి