December Movies: ఏడాది చివర్లో సినిమాల జాతర.. డిసెంబర్లో విడుదలయ్యే చిత్రాలు ఇవే.. అఖండ 2 నుంచి శంభాల వరకు..
ఏడాది చివరకు వచ్చేశాము. మరో నెల రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఇన్నాళ్లు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. భారీ బడ్జెట్ సినిమాలు కలెక్షన్స్ వర్షం కురిపించగా.. చిన్న సినిమాలు అడియన్స్ హృదయాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు డిసెంబర్ నెలలోనూ సినిమాల జాతర రాబోతుంది. ఈ నెలలో ఏఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో తెలుసుకుందామా.

డిసెంబర్ నెల వచ్చేసింది. 2025 చివరలో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు పలు సినిమాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ నెలలో విభిన్న కంటెంట్ చిత్రాలు.. భారీ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ రాబోతున్నాయి. అఖండ 2 తాండవం సినిమా ఈనెల మొదటివారంలోనే బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అలాగే క్రిస్మస్ సందర్భంగా నాలుగో వారంలో మీడియం రేంజ్ సినిమాల హవా ఉండనుంది. అయితే ఈ నెలలో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా. మరీ అవెంటో ఓ లుక్కెయ్యండి.
అఖండ 2 తాండవం.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న సినిమా అఖండ 2 తాండవం. గతంలో సూపర్ హిట్ అయిన అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇందులో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలకపాత్రలో నటిస్తుండగా.. డిసెంబర్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
మోగ్లీ.. రోషన్ కనకాల హీరోగా డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన సినిమా మోగ్లీ. సాక్షీ సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. అలాగే మరో యంగ్ హీరో రామ్ కిరణ్ నటించిన సఃకుటుంబానాం సైతం అదే రోజున విడుదల కానుంది.
శంబాల.. చాలా కాలం తర్వాత ఆదిసాయికుమార్ నటిస్తున్న సినిమా శంబాల. డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సైన్స్, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందించారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.
ఛాంపియన్.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా ఛాంపియన్ . ఇందులో మలయాళీ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. అలాగే అదే రోజున శివాజీ, నవదీప్, బిందుమాధవి నటించిన దండోరా మూవీ సైతం అదే రోజున రిలీజ్ కానుంది.
అవతార్ 3.. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ విజువల్ వండర్ అవతార్ 3. ఇప్పటికే రెండు భాగాలుగా అలరించిన ఈ సినిమా ఇప్పుడు మూడో భాగం అవతార్ .. ఫైర్ అండ్ యాష్.. ఈ సినిమాను డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?




