
నవంబర్ మొదటి వారంలో థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తునన ఈ సినిమాలో రష్మికకు జోడిగా కన్నడ హీరో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయనున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది రష్మిక. అలాగే సుధీర్ బాబు హీరోగా డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా జటాధర. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని నవంబర్ 7న విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇందులో బాలీవుడ్ తారలు సోనాక్షి సిన్హా, శిల్ప శిరోద్కర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర.. ఇలా అన్నింటినీ దీంట్లో చూపించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాతోపాటు విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఆర్యన్ మూవీ సైతం అడియన్స్ ముందుకు రానుంది. గత నెల 31న తెలుగు, తమిళం భాషలలో ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు నవంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా సైతం అడియన్స్ ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/ వెబ్ సిరీస్..
అమెజాన్ ప్రైమ్ వీడియో..
రాబిన్ హుడ్.. వెబ్ సిరీస్.. నవంబర్ 2.
నైన్ టూ నాట్ మీట్ యూ.. వెబ్ సిరీస్.. నవంబర్ 3
జియో హాట్ స్టార్..
బ్యాడ్ గర్ల్.. నవంబర్ 4
ది ఫెంటాస్టిక్ 4.. ఇంగ్లీష్.. నవంబర్ 5
సోనీలివ్..
మహారాణి.. వెబ్ సిరీస్.. నవంబర్ 7
నెట్ ఫ్లిక్స్..
ఇన్ వేవ్స్ అండ్ వార్.. హాలీవుడ్.. నవంబర్ 3
బారాముల్లా.. హిందీ.. నవంబర్ 7
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..