Tollywood: సీనియర్ హీరోలను అలా చూసేందుకు అడియన్స్ ఇష్టపడట్లేదా ?..

| Edited By: Rajitha Chanti

Aug 17, 2023 | 10:17 PM

హీరోయిన్లకు వయసైపోతుందేమో కానీ హీరోలకు మాత్రం మన దగ్గర ఎప్పుడూ పాతికేళ్ళు మించవు. అందుకే 60 ప్లస్ హీరోలు కూడా డ్యూయెట్లు పాడుతుంటారు. కానీ అది వర్కవుట్ అయినన్ని రోజులు ఎవరూ ఏం మాట్లాడరు.. కానీ తేడా కొడితే మాత్రం విమర్శలు తప్పవు. ఇప్పుడు చిరు విషయంలో ఇదే జరుగుతుంది.. వాల్తేరు వీరయ్యలో నచ్చిన డాన్సులు, డ్యూయెట్లు.. భోళా శంకర్‌కు వచ్చేసరికి ఆడియన్స్‌కు నచ్చలేదు.

Tollywood: సీనియర్ హీరోలను అలా చూసేందుకు అడియన్స్ ఇష్టపడట్లేదా ?..
Bhola Shankar, Jailer
Follow us on

హీరోలేదైనా కారెక్టర్ చేస్తే దాన్ని ఓన్ చేసుకోవాలి ఆడియన్స్ కూడా. వాళ్లు ఓన్ చేసుకుంటే సినిమా హిట్.. అలా కాకుండా ఆర్టిఫీషియల్‌గా అనిపించిందా అంతే సంగతులు. మరీ ముఖ్యంగా ఏజ్‌కు రెస్పెక్ట్ ఇచ్చి అలాంటి పాత్రలు చేసారా.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంతే. ఈ మధ్య అది ప్రూవ్ అవుతుంది కూడా. వయసుకు తగ్గ పాత్రలు చేస్తే రికార్డులు చెదిరిపోతున్నాయక్కడ. ఇంతకీ ఏంటా సినిమాలు..?

హీరోయిన్లకు వయసైపోతుందేమో కానీ హీరోలకు మాత్రం మన దగ్గర ఎప్పుడూ పాతికేళ్ళు మించవు. అందుకే 60 ప్లస్ హీరోలు కూడా డ్యూయెట్లు పాడుతుంటారు. కానీ అది వర్కవుట్ అయినన్ని రోజులు ఎవరూ ఏం మాట్లాడరు.. కానీ తేడా కొడితే మాత్రం విమర్శలు తప్పవు. ఇప్పుడు చిరు విషయంలో ఇదే జరుగుతుంది.. వాల్తేరు వీరయ్యలో నచ్చిన డాన్సులు, డ్యూయెట్లు.. భోళా శంకర్‌కు వచ్చేసరికి ఆడియన్స్‌కు నచ్చలేదు.

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్.. 

ఆడియన్స్ అంటున్నారని కాదు కానీ ఓ స్టేజ్ దాటిన తర్వాత 60 ప్లస్ హీరోలను అలా చూడటం కూడా కష్టమే. అదే వయసుకు తగ్గ పాత్రలు చేసారంటే.. వాళ్ల ఇమేజ్‌తో పాటు మార్కెట్ కూడా డబుల్ అవుతుంది. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ జైలర్, విక్రమ్ సినిమాలే. చిరంజీవి తోటి హీరోలైన రజినీ, కమల్ తమ ఏజ్‌కు తగ్గట్లు.. ఇందులో తాతయ్యలుగా నటించి హీరోయిజం చూపించారు.. 400 కోట్లు వసూలు చేసారు.

అనిరుద్ రవిచంద్రన్ ట్వీట్.. 

జైలర్‌ను కేవలం రజినీ ఇమేజ్ నడిపించింది. ఈ చిత్రం 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. మరోవైపు మోహన్ లాల్, మమ్ముట్టి సైతం ఏజ్‌కు రెస్పెక్ట్ ఇచ్చి అలాంటి పాత్రల్లోనే ఒదిగిపోతున్నారు.. అందుకే ఇండస్ట్రీ హిట్స్ వస్తున్నాయి. మన దగ్గర బాలయ్య సైతం భగవంత్ కేసరిలో ఓల్డేజ్ కారెక్టర్ చేస్తున్నారు. దీనిపై అంచనాలెలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. మొత్తానికి వయసుకు తగ్గ పాత్రలు చేస్తే.. దానికి వాళ్ల ఇమేజ్ కూడా తోడై బాక్సాఫీస్ బద్దలైపోతుంది.

కమల్ హాసన్ ట్వీట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.